అతనే బిగ్ బాస్ విన్నర్ అంటున్న సోహెల్.. భయంతో పోస్ట్ డిలీట్ చేశానంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది.ఎక్కువమంది సెలబ్రిటీలు సన్నీని సపోర్ట్ చేస్తున్నప్పటికీ షణ్ముఖ్, శ్రీరామచంద్ర కూడా బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

 Bigg Boss 5 Syed Sohel Ryan Predicts Sreeram Or Sunny Will Win Title, Bigg Boss-TeluguStop.com

నాగార్జున గత సీజన్లలా ఈ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేశారు.బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 3 కంటెస్టెంట్లలో ఒకరైన సోహెల్ కు ప్రస్తుతం సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 5లో గెలవబోయే కంటెస్టెంట్ గురించి కామెంట్ చేస్తే ఇతర కంటెస్టెంట్ల అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతాయని మొదట సోహెల్ భయపడ్డారు.అయితే బిగ్ బాస్ హౌస్ లోని సన్నీని చూస్తే తనను తాను చూసుకున్న విధంగా ఉందని సోహెల్ చెప్పుకొచ్చారు.

గతంలో సన్నీ విన్నర్ అవుతాడని సోహెల్ పోస్ట్ పెట్టడంతో పాటు బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్లలో కాజల్, మానస్ కూడా ఉంటారని తెలిపారు.

Telugu Bigg Boss, Kajal, Manas, Shanmukh, Sreeram, Sunny, Telugu Biggboss, Win-M

అయితే ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో ఆ తర్వాత సోహెల్ పోస్ట్ నే డిలీట్ చేశారు.ఆ తర్వాత కూడా బిగ్ బాస్ షో గురించి సోహెల్ ఆచితూచి మాట్లాడుతున్నారు.తాజాగా సోహెల్ ఈ షో గురించి స్పందిస్తూ తాను ఎవరికి సపోర్ట్ చేసినా మా కంటెస్టెంట్ ఏం చేశాడు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని సోహెల్ అన్నారు.

తన ఆలోచన ప్రకారం సన్నీ, మానస్, కాజల్ టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉంది.

Telugu Bigg Boss, Kajal, Manas, Shanmukh, Sreeram, Sunny, Telugu Biggboss, Win-M

ఈ వారం సిరి, కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నారని తన ఫేవరెట్ కంటెస్టెంట్లు సన్నీ, శ్రీరామచంద్ర అని వీళ్లిద్దరిలో ఒకరు గెలవడం మాత్రం గ్యారంటీ అని సోహెల్ వెల్లడించారు.మరి సోహెల్ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube