10 గంటల పాటు ట్విట్టర్ ఇండియాలో షన్నూ టాప్‌

Bigg Boss 5 Shannu Hash Tag Trend In India And World

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చింది.ఈ సీజన్‌ విజేత ఎవరు అనే విషయంలో చాలా సస్పెన్స్ గా ఉంది.

 Bigg Boss 5 Shannu Hash Tag Trend In India And World-TeluguStop.com

గత సీజన్ లో అభిజిత్‌ విజేత అంటూ అంతా చాలా నమ్మకంగా ఉండే వారు.కాని ఇప్పుడు విజేత ఎవరు అనే విషయంలో సస్పెన్స్ ఉంది.

సన్నీ మరియు షన్నూ ల మద్య ట్రోఫీ దోబూచులాడే అవకాశాలు ఉన్నాయి.వీరిద్దరు కలిసి ఏం చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షన్నూ వెళ్లడమే విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తో వెళ్లాడు.ఇక సన్నీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత తన పద్దతితో పేరు దక్కించుకుని ఎక్కవ మందికి కనెక్ట్ అయ్యాడు.

 Bigg Boss 5 Shannu Hash Tag Trend In India And World-10 గంటల పాటు ట్విట్టర్ ఇండియాలో షన్నూ టాప్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇద్దరిలో ఎవరు విజేత అంటే ఇప్పుడే చెప్పలేం అంటున్నారు.

Telugu Biggboss, Shannu, Sunny Bigg Boss-Movie

మొత్తానికి షన్నూ మరియు సన్నీల మద్య పోటీ తీవ్రంగా ఉంటుంది అనుకుంటున్న సమయంలో షన్నూ అభిమానులు ట్విట్టర్ ట్రెండ్‌ చేసి తమ షన్నూ నే విజేత అంటూ హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.అన్‌ స్టాపబుల్‌ షన్నూ హ్యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్ ఇండియాలో దాదాపుగా 10 గంటల పాటు ట్రెండ్‌ అయ్యింది. వరల్డ్‌ వైడ్ గా కూడా టాప్ ట్రెండ్‌ లో ఆ హ్యాష్‌ ట్యాగ్‌ కొన్ని గంటలు సందడి చేసింది.

కేవలం కొన్ని గంటల వ్యవదిలో మిలియన్ ట్వీట్స్ ను చేసిన షన్నూ అభిమానులు స్టార్‌ హీరోల అభిమానులను మించి పోయారు.వీరు కనుక ఇదే జోరుతో ఫినాలే లో ఓట్లు వేస్తే ఖచ్చితంగా షన్నూ విజేత అనడంలో సందేహం లేదు అంటున్నారు.

హాట్‌ స్టార్ మరియు ఫోన్‌ ల ద్వారా ఓట్లు వేస్తూనే ఉండాలి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.సోషల్‌ మీడియాలో షన్నూ గురించి చేస్తున్న.చేయబోతున్న ప్రచారంకు శాంపిల్ మాత్రమే అంటున్నారు.షన్నూ రచ్చ మామూలుగా ఉండదు అంటూ ఆయన అభిమానులు తమ ఓట్లతో చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు.

#Sunny Bigg Boss #Biggboss #Shannu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube