దారుణమైన బూతులతో హౌస్ ని బూతు హౌస్ గా మార్చేసిన కంటెస్టెంట్లు?

బిగ్ బాస్ హౌస్ లో ఎంతో వినోదాన్ని పంచుతూ కంటెస్టెంట్ లో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం బుధవారం కూడా పూర్తి కానుంది.

 Bigg Boss 5 Contestants Gone Wild In Tenth Week Captaincy Task Details,  Bigg Bo-TeluguStop.com

ఇకపోతే 10వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చారు.ఇందులో రవి, సిరి, కాజల్, సన్నీ కెప్టెన్సీ టాస్క్ కి అర్హత సాధించారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ వీరికి టవర్ లో ఉంది పవర్ టాస్క్ ఇచ్చారు.ఈ టాస్క్ లో భాగంగా ఇటుకలతో టవర్ కట్టడంతో పాటు టవర్ కూలిపోకుండా చూసుకోవాలి.

మిగిలిన హౌస్ సభ్యులను ఆ టవర్ పడగొట్టడానికి ప్రయత్నం చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు.

ఇక ఈ టాస్క్ అనీ మాస్టర్ ను సంచాలకులగా నియమించారు.

మొదటి రౌండ్లో కాజల్ అవుట్ కాగా రెండో రౌండ్లో సన్నీ అవుట్ అయ్యారు.ఇక మూడో రౌండ్ లో ఉన్న సిరి, రవిని టార్గెట్ చేశారు.

ఇక సన్నీ టాస్క్ లో పాల్గొనగా అతడు బాల్స్ విసరకుండా సన్నీ అతనిని గట్టిగా పట్టుకుంది.ఆ సమయంలో సన్నీ ఆటలో ఉన్నప్పుడు తనని పట్టుకుంటే తంతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

ఇలా సన్నీ వార్నింగ్ ఇవ్వడంతో సిరి అబ్బా ఏది తన్ను చూద్దాం అంటూ తనని రెచ్చగొట్టింది.

Telugu Anchor, Anee Master, Bigg Boss, Wild, Kajal, Ravi, Shanmukh, Siri, Sunny,

తంతాను నేను కనుక నీ పై పడితే అప్పడం అవుతావు అంటూ అన్ని అనడంతో వెళ్లి అప్పడాలు అమ్ముకో అంటూ సిరి వార్నింగ్ ఇస్తుంది.ఇలా వీరిద్దరూ గొడవ పడుతుంటే ఊహించని విధంగా ఈ గొడవ మధ్యలోకి షణ్ముఖ్ ఎంటరయ్యాడు.సిరితో గొడవ పడుతుంటే మధ్యలో నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు అంటూ సన్నీ షణ్ముఖ్ తో గొడవకు దిగుతాడు.

అప్పడం అప్పడం అనద్దు అంటూ షణ్ముఖ్ అనడంతో ఊరికే డైలాగులు చెప్పడం కాదు ఏది తన్ని చూపించు అంటూ సిరి తనని రెచ్చగొడుతుంది.

Telugu Anchor, Anee Master, Bigg Boss, Wild, Kajal, Ravi, Shanmukh, Siri, Sunny,

ఇలా సన్నీ, సిరి, షణ్ముఖ్ మధ్య గొడవ జరగడంతో సంచాలకులుగా ఉన్నటువంటి అని మాస్టర్ మాత్రం నాగిని నాగిని అంటూ డాన్సులు వేస్తూ పిచ్చి పట్టినదానిలా ఒక టీం కి సపోర్ట్ చేస్తూ హేళన చేసింది.ఇలా సిరీ, అనీమాస్టర్ గొడవకు ఆజ్యం పోయడంతో నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఇది బిగ్ బాస్ హౌసా లేకపోతే బూతుల హౌసా అంటూ నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య ఇలాగే బూతుపురాణం కొనసాగితే మాత్రం ఇకపై బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఆదరించరని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube