మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు.. కానీ హౌస్ లో ఏడ్చా: శ్వేత వర్మ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది.సీజన్ 5 కొనసాగుతున్నా కొద్దీ కంటెస్టెంట్ల మధ్య గొడవలతో పాటు, వారి మధ్య సంబంధాలు కూడా పెరుగుతున్నాయి .

 Bigg Boss 5 Contestant Swetha Varma Emotional Comments About Her Mother, Swetha-TeluguStop.com

ప్రతీ కంటెస్టెంట్స్ ఎక్కడా తగ్గేదేలే అనే తీరులో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ టాస్క్‌ల్లో పాల్గొంటూ తమ సత్తా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన నామినేషన్స్‌లో ఒకరైన శ్వేతా వర్మ తాజాగా బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశారు.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను హౌజ్‌లో గడిపిన రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు శ్వేతా వర్మ.తన మదర్ చనిపోయినపుడు ఉన్న ఎమోషన్‌నే కంట్రోల్ చేశారు కానీ, ఈ గేమ్‌ షోలో ఎందుకు కంట్రోల్ చేసుకోలేక పోయారన్న దానిపై శ్వేతావర్మ వివరణ ఇచ్చారు.

నిజానికి ఆ ఎమోషన్‌ను కంట్రోల్‌ చేశానని అనుకోను, ఆ ఎమోషన్‌ నుంచి తప్పించుకున్నానని శ్వేతా వర్మ తెలిపారు.ఎందుకంటే దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే అని ఆమె సమాధానమిచ్చారు.

అంతే తన దృష్టిలో తన మదర్ లేరు అన్నది చాలా పెద్ద విషయమన్న శ్వేతా వర్మ, నాకే కాదు మన ఫ్యామిలో ఒకరు చనిపోయారు అనేది చాలా పెద్ద విషయం అని ఆమె తెలిపారు.అది ఒక రోజుతో పోయేదో, ఒక రోజులోనే మర్చిపోయేదో కాదని ఆమె అన్నారు.

ఎందుకంటే వాళ్లతో మళ్లీ మనం ఎప్పుడూ మాట్లాడలేము, వాళ్లని మళ్లీ ఎప్పుడూ చూడలేము అని శ్వేతా వర్మ వివరించారు.

Telugu Mother, Swetha Varma-Movie

ఇకపోతే బిగ్‌బాస్‌ ఉన్నపుడు తనలో ఉన్న ఎమోషన్స్ సందర్భాన్ని బట్టి బయటికి వచ్చాయని శ్వేతా వర్మ అన్నారు.తాను అంత ఏడుస్తానని ఎప్పుడూ అనుకోలేదన్న ఆమె, అసలు నిజానికి బయట అంత ఏడవనని తెలిపారు.అక్కడికెళ్లాక మాత్రం మాటిమాటికీ ఏడుపొచ్చేది అని ఆమె చెప్పారు.

ఒకానొక సందర్భంలో నరాలు తెగిపోతాయేమోనని అనిపించినట్టు ఆమె చెప్పుకొచ్చారు.ఒక వైపు టాస్కులు ఎవరూ తగ్గరు.

కానీ విశ్వ, శ్రీరామ్‌, తనను హైలెట్ చేస్తారని, అగ్రెస్సివ్‌గా ఆడుతారాని అంటుంటారని ఆమె చెప్పారు.అలా చెప్పే సరికి ఆడినా సమస్యే, ఆడకపోయినా ప్రాబ్లమే, క్యాప్టెన్ అయినా ప్రాబ్లమే, క్యాప్టెన్ కాకపోయినా ప్రాబ్లమే అని శ్వేతావర్మ అన్నారు.

ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య అసలు ఏం చేయాలో తెలియకపోయేదని ఆమె వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube