బిగ్ ‌బాస్ 4 విజేత అతడే అంటున్న గంగవ్వ..!  

Gangavva Says Avinash is Bigg Boss House winner,gangavva, bigg boss 4, avinash, akil, harika , sensational comments,Wild card entry, Bigg Boss Winner - Telugu Akil, Avinash, Bigg Boss 4, Bigg Boss Winner, Gangavva, Gangavva Says Avinash Is Bigg Boss House Winner, Harika, Sensational Comments, Wild Card Entry

తెలుగులో బిగ్ బాస్ 4 సీజన్ నెల రోజులు దాటి ముందుకు సాగుతోంది.ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అలాగే మొత్తం ఐదు మంది బయటికి రావడం జరిగింది.

TeluguStop.com - Bigg Boss 4 Winner Avinash Says Gangavva

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి స్పెషల్ ఎంట్రీగా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ తన అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చేసింది.బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టి అందుకు తగ్గట్లుగా ట్రీట్మెంట్ తీసుకుంది.

గంగవ్వ పూర్తిగా కోలుకున్న తర్వాత కొన్ని సంచలన కామెంట్లు చేస్తోంది ఇప్పుడు అవి బుల్లితెర ప్రేక్షకులలో ఎంతగానో హాట్ టాపిక్ గా మారాయి.

TeluguStop.com - బిగ్ ‌బాస్ 4 విజేత అతడే అంటున్న గంగవ్వ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అయిన చాలా మంది గురించి కొన్ని ఇంటర్వెల్లో ఇప్పటికే మాట్లాడింది.

అందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్ అవినాష్, కుమార్ సాయి, అఖిల్, హారిక మొదలగు వారిపై గంగవ్వ వ్యాఖ్యలు చేసింది.అయితే ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో విజేత ఎవరన్నది గంగవ్వ జోస్యం చెప్పినే చెప్పేసింది.

ఈ నాలుగో సీజన్ టైటిల్ విజేతగా నిలిచేది అవినాష్ అని గంగవ్వ బల్లగుద్ది చెబుతోంది.అయితే నిజంగానే గంగవ్వ చెప్పినట్టుగా ముక్కు అవినాష్ గెలిచినట్లయితే అది నిజంగా బిగ్ బాస్ హౌస్ లో చరిత్రే అవుతుంది.

అయితే దీనికి కారణం లేకపోలేదు.ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వ్యక్తి సీజన్ విజేతగా నిలిచిన దాఖలాలు లేవు.అయితే గంగవ్వ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ విజేతగా నిలుస్తాడని చెప్పడంతో అందరూ ఆ విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు.

అయితే గంగవ్వ చెప్పినట్టు జరిగే అవకాశం ఉందా అని నెటిజెన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

అయితే గంగవ్వ చెప్పినట్టుగా అవినాష్ కు రోజురోజుకు బిగ్ బాస్ షో పరంగా చాలా మంచి మార్కులే పడుతూ వస్తున్నాయి.కేవలం వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా వచ్చాడని ఒకే ఒక్క నెగటివ్ పాయింట్ తప్పించి, మిగతా అన్ని విధాలుగా ఆయనకు ప్లస్ పాయింట్స్ గానే కొనసాగుతున్నాయి.

అవినాష్ బిగ్ బాస్ షో లోకి ఎంటర్ అయిన తరువాత నుండి ఆయన అందరితో కలిసి పోయి వారిని ఉత్సాహపరచడమే కాకుండా బయట చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.చూడాలి మరి ఇంక ముందు అవినాష్ ఆడే ఆట, తాను నడుచుకునే పద్ధతిపై తాను బిగ్ బాస్ విజేత అవుతాడో లేదో…? బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే ఎలాంటి ఖచ్చితమైన అంచనాలు వేయలేమని ప్రజలు భావిస్తున్నారు.

#Wild Card Entry #Gangavva #Akil #Harika #Avinash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss 4 Winner Avinash Says Gangavva Related Telugu News,Photos/Pics,Images..