చిరంజీవితో మనసువిప్పి మాట్లాడిన బిగ్ బాస్ విన్నర్.. ఏమైందంటే?

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ల గురించి అందరికీ తెలిసిందే.ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు టైటిల్ విన్నర్ అయ్యేవరకు తమ పనులు తాము చేసుకుంటూపోతుంటారు‌.

 Bigg Boss 4, Winner Abhijeet, Megastar Chiranjeevi, Meets, Tollywood, Biggboss T-TeluguStop.com

అంతేకాకుండా టైటిల్ విన్నర్ సమయంలో స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా అవార్డును అందిస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చిరంజీవితో మనసు విప్పి కొన్ని విషయాలు మాట్లాడారు.

ఇంతకీ అతనెవరో కాదు.

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరోగా పరిచయమైన అభిజిత్ ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకోలేకపోయాడు.ఇక ఇతను అలా సినీ పరిశ్రమకు దూరంగా ఉండగా బిగ్ బాస్ ఫోర్ సీజన్ లో అడుగు పెట్టాడు.

అందులో తన క్యారెక్టర్, తను ఆడే విధానం, ఉండే విధానం ప్రేక్షకులకు ఆకట్టుకోగా టైటిల్ విన్నర్ సంపాదించుకునే అవకాశం అందుకున్నాడు.

Telugu Abijeet, Bigg Boss, Meets, Chiranjeevi, Abhijeet-Movie

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తర్వాత ఆయన ఎటువంటి అవకాశాలను అందుకోకపోగ ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో బిజీగా ఉన్నాడు.అంతే కాకుండా కొన్ని ట్రిప్స్ చేస్తూ అక్కడ తాను గడిపిన క్షణాలను వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.ఇదిలా ఉంటే ఆయన తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నాడు.

అంతేకాకుండా ఆయన తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.నీ ఫస్ట్ మూవీ చూశాను.నిన్ను స్క్రీన్ మీద చూడగానే హీరో మెటీరియల్ అనిపించింది’ అని చిరంజీవి మాటలను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలిపాడు.ఇక అభిజిత్ కొన్ని విషయాలు మాట్లాడుతూ గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత సాధారణంగా ఎలా ఉంటారంటూ, ఈరోజు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందించింది వ్యక్తిని కలిశానని తెలిపాడు.

ఆయన తనను చాలా బాగా చూసుకున్నారంటూ, ఆయనతో మాట్లాడిన తీరు తనని ముగ్దుడిని చేశారంటూ తెలిపాడు.తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ మనిషితో తాను మనసు విప్పి మాట్లాడనని చెప్పుకొచ్చాడు.

ఇక ఆయన సలహాలు, సూచనలు తనకు ఎంతో విలువైనవంటూ, తనలాంటి యువకులను ప్రోత్సహిస్తున్నందుకు థాంక్యూ సర్ అంటూ తన జీవితంలో అద్భుతమైన రోజు అని కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube