ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న బిగ్ బాస్ అభిజిత్?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో గత సీజన్లను భిన్నంగా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లు ఎక్కువ మంది ఉన్న సంగతి తెలిసిందే.ఈ కంటెస్టెంట్లలో ప్రేక్షకులకు అంతోఇంతో పరిచయం ఉన్న కంటెస్టెంట్ అభిజిత్.

 Bigg Boss 4 Telugu Do You Know The Health Problem Of Contestant Abhijeet, Abhije-TeluguStop.com

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అభిజిత్ మిర్చి లాంటి కుర్రాడు అనే మరో సినిమాలో హీరోగా నటించాడు.అభిజిత్ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు.

మొదటి వారం సైలెంట్ గా కనిపించిన అభిజిత్ మోనాల్ లవ్ ట్రాక్ తో హైలెట్ అయ్యాడు.మోనాల్ తో పాటు హారికతో కూడా సన్నిహితంగా మెలుగుతున్న అభిజిత్ ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ప్రతిసారి భారీగా ఓటింగ్ రావడంతో సేవ్ అవుతున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ కు పోల్ అవుతున్న ఓట్లలో అభిజిత్ నామినేట్ అయితే అతనికే 40 శాతం ఓట్లు పోల్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అక్కినేని అఖిల్ కు ఫ్రెండ్ అయిన అభిజిత్ మైండ్ గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు.

అయితే అభిజిత్ ఫిజికల్ టాస్క్ లు ఎక్కువగా ఆడడని అతనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చూడటానికి ఫిట్ గా కనిపించే అభిజిత్ ఫిజికల్ టాస్కుల్లో పాల్గొనకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

అభిజిత్ భుజానికి చాలా నెలల క్రితం ఒక గాయం అయిందని.చికిత్స తీసుకున్నా ఇప్పటికీ అభిజిత్ గాయం వల్ల బాధ పడుతున్నాడని సమాచారం.

అందువల్లే బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన హౌస్ మేట్స్ అంతా టాస్కుల్లో పాల్గొన్నా అభిజిత్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు.మైండ్ గేమ్ ఉన్న టాస్కుల్లో మాత్రం తన ప్రతిభ చూపుతున్నాడు.

సోషల్ మీడియా వేదికగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతనితో కలిసి నటించిన వాళ్లు అభిజిత్ ను సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయమని ప్రేక్షకులను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube