మనలో చాలామంది సెలబ్రిటీలు అద్దాల్లాంటి భవనాల్లో జీవిస్తారని, లగ్జరీ కార్లలో తిరుగుతారని భావిస్తూ ఉంటారు.అయితే అందరి జీవితాలు అదే విధంగా ఉంటాయని అనుకుంటే మాత్రం పొరపాటే.
సినీ నటి షకీలా జీవితం గురించి తెలిస్తే సామాన్యులకు సైతం అయ్యో పాపం అని అనిపిస్తుంది.సినీ వినీలాకాశంలో తనకంటూ పేరు, గుర్తింపును తెచ్చుకున్న షకీలా గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కేరళలో స్టార్ హీరోలను మించి ఇమేజ్ ను సంపాదించుకున్న షకీలా సినిమా రిలీజైతే చాలు నిర్మాతలకు కనకవర్షం కురిసేది.షకీలా రోజుకు లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి.
కానీ సొంత వాళ్లే మోసం చేయడంతో ఆమె ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది.ప్రస్తుతం ఆమె చెన్నైలో ఒంటరి జీవనం సాగిస్తోంది.
దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన తరువాత తనకు షకీలాతో చేసిన ఇంటర్వ్యూ అంటే ఇష్టమని చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
అన్వేషణ అనే ప్రోగ్రామ్ కోసం షకీలా ఇంటికి వెళ్లానని.
ఆమె అపార్టుమెంట్ లోని గదిని చూసి ఆశ్చర్యపోయానని దేవి అన్నారు.ఒకే గదిలో అన్నీ ఉండటంతో తనకు కొన్ని క్షణాల పాటు ఏమీ అర్థం కాలేదని చెప్పారు.
ఆ గదిలో సరైన సామాన్లు కూడా లేవని.సిమెంట్ కూడా ఊడిపోయి ఉందని తెలిపారు.
యంగ్ ఏజ్ లో షకీలా దివ్యభారతిలా ఉందని అన్నారు.షకీలాను అందరూ చూసే కోణం వేరని అసలు కోణం వేరని తెలిపారు.
ఒక మనిషిని అన్ని కోణాల్లో గమనిస్తే మాత్రమే ఆ మనిషి గురించి పూర్తిస్థాయిలో అవగాహన వస్తుందని వెల్లడించారు.తనకు షకీలా నిజమైన మనస్తత్వం ఏంటో ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిందని దేవి చెప్పుకొచ్చారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు లక్షల్లో పారితోషికం తీసుకున్న షకీలా అంత దుర్భరమైన జీవితం గడుపుతోందా.? అని కామెంట్లు చేస్తున్నారు.