అవినాష్ రంగు బయటపెట్టిన నోయల్.. అవాక్కైన నెటిజన్లు..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో విజయవంతవంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.గతంలో ఆరోగ్యపరమైన కారణాల వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ కాగా నిన్న నోయల్ ఎలిమినేట్ అయ్యారు.

 Bigg Boss 4 Telugu Contenstant Noel Sean Comments On Amma Rajasekhar And Avinash-TeluguStop.com

నోయల్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఐతే లేవని తెలుస్తోంది.ఎలిమినేట్ అయిన నోయల్ బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అమ్మ రాజశేఖర్, అవినాష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

గత కొంత కాలంగా కాలు నొప్పి వల్ల ఇబ్బంది పడుతున్న నోయల్ తోటి కంటెస్టెంట్లు తాను బాధ పడుతుంటే జోకులు, సెటైర్లు వేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మొదట నోయల్ అమ్మ రాజశేఖర్, అవినాష్ లను కొంత సమయం ఒంటికాలిపై నిలబడమని చెప్పారు.

వాళ్లు కొంత సమయం నిలబడ్డ తరువాత ఒంటి కాలిపై నిలబడితే నొప్పిగా ఉందా.? అని ప్రశ్నించారు.వాళ్లు అవునని సమాధానం ఇవ్వగా తాను మీరు అనుభవించిన నొప్పి కంటే 1000 రెట్లు ఎక్కువ నొప్పిని అనుభవిస్తున్నానని పేర్కొన్నారు.

Telugu Amma Rajasekhar, Bigg Boss, Biggboss, Problems, Nagarjuna, Noel Sean-Late

తన కాలి నొప్పి గురించి అవినాష్, అమ్మ రాజశేఖర్ జోకులు వేశారని.ఈ చిల్లర కామెడీలు ఏంటని ప్రశ్నించారు.చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చూసే ఈ షోలో చిల్లర కామెడీల ప్రవర్తన ద్వారా అమ్మ రాజశేఖర్, అవినాష్ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

నోయల్ చేసిన వ్యాఖ్యలపై అవినాష్ స్పందిస్తూ బ్యాడ్ చేయాలని ఫిక్స్ అయిన తరువాత తానేం చేయలేనంటూ ఘాటుగా స్పందించారు.
అయితే నోయల్ మాత్రం ఎందుకు నటిస్తున్నావ్ అవినాష్.? అంటూ అవినాష్ చేసిన కామెంట్లు పిచ్చలైట్ అని అన్నారు.అయితే నోయల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నోయల్ చెప్పిన మాటల్లో నిజం ఉందని అవినాష్ రంగు బయటపడిందని.అవినాష్ అసలు స్వరూపం ఇదా.? అంటూ కొందరు అభిప్రాయపడుతుండగా మరి కొందరు నోయల్ తన స్నేహితులైన లాస్య, అభిజిత్, హారికలను విన్ అయ్యేలా చేయడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన అవినాష్ పై విమర్శలు చేశారని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube