బిగ్‌బాస్ 4లో నాగ్‌కు ఎంత ముడుతుందో తెలుసా?

టాలీవుడ్‌లో రియాలిటీ షోలు ఎన్ని ఉన్నా బిగ్‌బాస్ రియాలిటీ షో వస్తుందంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.జనాలు టీవీలకే అతుక్కుపోయి చూసే ఈ షో ఇప్పటికే మూడు సీజన్‌లు పూర్తి చేసుకుంది.

 Bigg Boss 4 Nagarjuna-TeluguStop.com

కాగా తొలి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్‌గా వ్యవహరిస్తూ, ఆ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు.ఇక రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌లుగా వ్యవహరించి బిగ్‌బాస్‌ను టాప్ రియాలిటీ షోగా నిలిపారు.

అయితే ఇప్పుడు బిగ్‌బాస్ 4వ సీజన్‌కు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.ఈసారి మరింత క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలను పార్టిసిపెంట్స్‌గా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన పనులను కూడా వారు అప్పుడే మొదలుపెట్టేశారు.ఇక ఈ సీజన్‌కు హోస్ట్‌గా ఎవరు ఉంటారా అనే ప్రశ్నకు మరోసారి అక్కినేని నాగార్జున రూపంలోనే సమాధానం లభించింది.

 Bigg Boss 4 Nagarjuna-బిగ్‌బాస్ 4లో నాగ్‌కు ఎంత ముడుతుందో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతేడాది నాగ్ చేసిన యాంకరింగ్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.దీంతో మరోసారి నాగ్‌నే ఈ షో హోస్ట్‌గా పెట్టాలని నిర్వాహకులు నిర్ణయించారు.

కాగా నాగ్ ఈసారి బిగ్‌బాస్ షోకు ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈసారి నాగ్ తన రెమ్యునరేషన్ తగ్గిస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ అవన్నీ గాలివార్తలే అని నిర్వాహకులు అంటున్నారు.మూడో సీజన్‌కు నాగ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో, ఈసారి కూడా అంతే ముట్టజెప్పనున్నారట.దీనికి సంబంధించిన ఒప్పందం కూడా పర్తయినట్లు తెలుస్తోంది.మరి ఈసారి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే ‘బిగ్‌బాస్ 4’ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలంటే ఈ షో టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Bigg Boss #Bigg Boss 4 #Remuneration #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు