బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతానంటున్న గంగవ్వ..?

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన రోజు నుంచి వీక్షకుల్లో గంగవ్వ గురించి జరుగుతున్న చర్చ అంతాఇంతా కాదు.ఆరు పదుల వయస్సులో బిగ్ బాస్ హౌస్ కు ఎంపికైన గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ వీక్షకులకు సుపరిచితం.

 Bigg Boss 4 Contestant Gangavva Sensational Comments,  Gangavva,bigg Boss 4 , Me-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ తర్వాత చాలామంది నెటిజన్లు తమకు బిగ్ బాస్ షో అంటే ఆసక్తి ఉండదని అయితే ఈ సీజన్ మాత్రం గంగవ్వ కోసం చూస్తామని కామెంట్లు చేశారు.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ చేసిన వ్యాఖ్యలు బిగ్ బాస్ అభిమానులను ఒకింత షాక్ కు గురి చేసేలా ఉన్నాయనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ లో తాను ఎన్నో వారాలు ఉండలేనని సంచలన వ్యాఖ్యలు చేసింది.తన భర్త తాగుడుకు బానిసయ్యాడని తాగొచ్చి తనను కొట్టేవాడని భర్త తాను చెప్పిన మాట వినకుండా అయిపోయాడని గంగవ్వ చెప్పుకొచ్చింది.

నాగార్జునను నడిపన్న(రెండో అన్న) అని పిలిచి పాట పాడింది.

కట్టప్ప గురించి చెప్పాలంటూ అందరూ ర్యాప్ సాంగ్ పాడగా తన చెవులు గిల్లుమంటున్నాయని గంగవ్వ చెప్పడంతో ఇంటి సభ్యులంతా సైలెంట్ అయ్యారు.

నాగార్జున సొహైల్, అరియానాతో ఆడించిన ఆటలో ర‌క‌ర‌కాల బొమ్మ‌లు ఉన్న మెడ‌ల్స్‌ను కంటెస్టెంట్ల మెడ‌లో సూచించగా గంగవ్వకు తోపు అనే మెడల్‌ ఉన్న బొమ్మను వేశారు.నిజానికి బిగ్ బాస్ 4 లో గంగవ్వ అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.

తొలిరోజు ఎపిసోడ్ తర్వాత చాలామంది గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కావాలని ఆకాంక్షించారు.గంగవ్వ పేరిట సోషల్ మీడియాలో ఆర్మీలు కూడా ప్రారంభమయ్యాయి.ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కు గంగవ్వ నామినేట్ కాగా అనధికారికంగా నిర్వహించిన సర్వేల్లో దాదాపు 50 శాతం ఓట్లు గంగవ్వకే వచ్చాయి.అందరూ గంగవ్వను గెలిపించాలని చూస్తుంటే ఆమె మాత్రం భిన్నంగా హౌస్ లో ఎక్కువ వారాలు ఉండలేనని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube