ప్రేమలో పడి చావుదెబ్బలు తిన్న అవినాష్.. ఏమైందంటే..? - Bigg Boss 4 Fame Avinash Was Beaten Up By His Girl Friend Parents

bigg boss 4 fame avinash was beaten up by his girl friend parents, mukku avinash , avinash comedy stars, comedy stars latest promo - Telugu Avinash, Avinash Comedy Stars, Bigg Boss 4, Bigg Boss 4 Fame Avinash Was Beaten Up By His Girl Friend Parents, Comedy Stars Latest Promo, Comedy Stars Show, Girl Friend Parents, Mukku Avinash

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది మంచి కమెడియన్లుగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు సినిమా ఆఫర్లను పొందిన సంగతి తెలిసిందే.అలా జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో అవినాష్ ఒకరు.

 Bigg Boss 4 Fame Avinash Was Beaten Up By His Girl Friend Parents-TeluguStop.com

వేర్వేరు కారణాల వల్ల జబర్దస్త్ షోకు దూరమైన అవినాష్ ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ను చేస్తున్నారనే సంగతి తెలిసిందే.

కామెడీ స్టార్స్ ప్రోమోలో అవినాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా బ్యాక్ గ్రౌండ్ లో సలామ్ రాకీభాయ్ సాంగ్ ప్లే అవుతుంది.

 Bigg Boss 4 Fame Avinash Was Beaten Up By His Girl Friend Parents-ప్రేమలో పడి చావుదెబ్బలు తిన్న అవినాష్.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవినాష్ తన అసిస్టెంట్ ను అద్దం చూపించమని చెప్పి అసిస్టెంట్ అద్దం చూపించిన తరువాత తీసెయ్ తీసెయ్ అంటాడు.ఆ తరువాత అసిస్టెంట్ ఆమె హీరోయిన్ అని చెప్పి ఒక అమ్మాయిని చూపించగా ఆ అమ్మాయితో తన గురించి మాట్లాడమని అవినాష్ చెబుతాడు.

అవినాష్ అలా చెప్పగానే అసిస్టెంట్ ఎంతమంది కావాలి సార్ మీకు అని ప్రశ్నిస్తాడు.

తన గురించి పాజిటివ్ గా చెప్పాలని అవినాష్ అడగగా అసిస్టెంట్ నైట్ అంతా చూసి డిలేట్ చేశారు అది చెప్పాలా అంటూ పంచ్ వేశారు.

హీరోయిన్ ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన అమ్మాయి కాగా పెళ్లి సంబంధం మాట్లాడాలని అవినాష్ జైలులో ఉన్న అమ్మాయి తండ్రి దగ్గరకు వెళతాడు.జైలుకు వెళ్లిన అవినాష్ ఒక ఖైదీపై చెయ్యి వేసి ఏం తప్పు చేసి జైలుకు వచ్చావని ప్రశ్నిస్తాడు.

ఆ ప్రశ్నకు అవతలి వ్యక్తి ఇలా ఒకడు ఇలా చెయ్యి వేసినందుకే చెయ్యి తీసి జైలుకు వచ్చానని బదులిస్తాడు.

ఆ తరువాత హీరోయిన్ తండ్రితో మీ అమ్మయిని ఒక అందగాడు లవ్ చేశాడని ఆ అందగాడు తానేనని చెబుతాడు.

హీరోయిన్ తండ్రి అవినాష్ ను చితకబాదడంతో పాటు మిగత ఖైదీలతో కూడా అవినాష్ ను కొట్టిస్తాడు.ప్రేమలో పడి అవినాష్ హీరోయిన్ తండ్రి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.

అవినాష్ కు జోడీగా ఈసారి కొత్తమ్మాయి కనిపిస్తుండటం గమనార్హం.

#Bigg Boss 4 #ComedyStars #AvinashComedy #Avinash #GirlFriend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు