బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. హౌస్ లోకి నోయల్ రీఎంట్రీ..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో ఎలిమినేషన్లు జరగడంతో పాటు బిగ్ బాస్ షోలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

 Bigg Boss 4 Contestant Noel Sean Rean Reentry In Bigg Boss Show, Bigg Boss Show,-TeluguStop.com

ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ షోలో “ఏదైనా జరగొచ్చు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే చాలా రోజుల నుంచి వేధిస్తున్న కాలు నొప్పి వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి నోయల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఎలిమినేట్ అయిన తరువాత నోయల్ బిగ్ బాస్ స్టేజ్ పై అమ్మ రాజశేఖర్, అవినాష్ గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.అప్పటివరకు అమ్మ రాజశేఖర్, అవినాష్ లపై బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉన్న సాఫ్ట్ కార్నర్ కాస్తా నోయల్ చేసిన వ్యాఖ్యల వల్ల వ్యతిరేకతగా మారింది.

అయితే ప్రేక్షకుల్లో కొందరు మాత్రం నోయల్ బయటకు వచ్చాక మాస్క్ తొలగించాడని కావాలనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన అవినాష్ పై విమర్శలు చేశాడని అభిప్రాయపడుతున్నారు.

అయితే నోయల్ ఎలిమినేట్ అయిన తరువాత మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఉండదని నాగార్జున స్పష్టం చేశారు.

కానీ హౌస్ లోకి నోయల్ మళ్లీ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.నిన్న నోయల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసి ఆ వీడియోలో అభిమానులు తనను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని.

ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫోన్లు, మెసేజ్ లను చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చని.

ఎలిమినేట్ అయిన వ్యక్తి తిరిగి వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుందని.త్వరలో పూర్తి వివరాలతో మళ్లీ కలుద్దామంటూ పోస్ట్ చేశారు.

దీంతో నోయల్ అభిమానులు హౌస్ లోకి మళ్లీ నోయల్ ఎంట్రీ ఇస్తాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే కరోనా, ఇతర కారణాల వల్ల ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్లీ బిగ్ బాస్ హౌస్ షోకి తీసుకోలేదు.

మరి నోయల్ రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లను సైతం ఆశ్చర్యపరుస్తాడేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube