నోయల్ బాధ పడుతున్న వ్యాధి ఇదే.. లక్షణాలేమిటంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షో సీజన్ 4 లో గత సీజన్లకు భిన్నంగా ఆరోగ్య సమస్యలతో కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్లను కంటెస్టెంట్లుగా ఎంపిక చేయరు.

 Bigg Boss 4 Contestant Noel Illness Symptoms, Noel Sean, Health Problems, Sympt-TeluguStop.com

బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాతే కంటెస్టెంట్లను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, వైద్య చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో రెండు వారాల క్రితం గంగవ్వ, నిన్న నోయల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఎలిమినేట్ అయిన తరువాత నోయల్ తాను భరించలేనంత నొప్పితో బాధ పడుతున్నానని చెప్పారు.

యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధితో నోయల్ బాధ పడుతున్నారు.ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎముకల పనితీరు నెమ్మదిస్తుంది.

సరైన చికిత్స తీసుకోకపోతే రోజులు గడిచే కొద్దీ ఎముకల పనితీరు పూర్తిగా మారుతుంది.శరీరంలోని అన్ని ఎముకలపై ఈ వ్యాధి ప్రభావం పడుతుందని తెలుస్తోంది.
ఈ వ్యాధి బారిన పడ్డవాళ్లు నడవటానికి కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.ఈ వ్యాధి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి.రాత్రి పడుకుని ఉదయం లేచే సరికి కాళ్లు మొద్దుబారిపోతాయి.వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కంటిచూపుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అందువల్లే బిగ్ బాస్ నిర్వాహకులు సైతం నోయల్ ను ఇంటి నుంచి బయటకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

వైద్యుల సలహాలు, సూచనల మేరకు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని సమాచారం.

ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో కొందరిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తాయి.అయితే కొంతకాలం చికిత్స చేయించుకుంటే ఈ ఆరోగ్య సమస్యను నయం చేయడం సాధ్యమేనని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube