బిగ్ బాస్ కుట్రను బయటపెట్టిన కుమార్ సాయి..?  

bigg boss 4 contestant kumar sai comments about footage, bigg boss 4 contestant kumar sai,bigg boss4, kumar sai, comedy skits, nagarjuna, eliminations - Telugu Bigg Boss 4, Bigg Boss 4 Contestant Kumar Sai, Bigg Boss 4 Contestant Kumar Sai Comments About Footage, Bigg Boss Strategies, Bigg Boss4, Comedy Skits, Eliminations, Footage, Kumar Sai, Nagarjuna

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 గత సీజన్లకు భిన్నంగా అనేక వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ షో ఎలిమినేషన్ ప్రక్రియ గురించి, ఓటింగ్ సరళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - Bigg Boss 4 Contestant Kumar Sai Comments About Footage

తాజాగా ఆదివారం రోజున ఎలిమినేట్ అయిన కుమార్ సాయి ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో తనకు అన్యాయం జరిగిందని కామెంట్లు చేశారు.
ఇప్పటికే కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ షో విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా తాజాగా ఆ జాబితాలో కుమార్ సాయి చేరారు.

షో ప్రారంభమై ఏడు వారాలు కాగా ఈ షోకు ఇప్పటికీ ఆశించిన స్థాయిలో రేటింగులు రావడం లేదు.స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ కు 18 పాయింట్ల రేటింగ్ వస్తుండగా బిగ్ బాస్ కు 8 పాయింట్లు కూడా రావడం లేదు.

TeluguStop.com - బిగ్ బాస్ కుట్రను బయటపెట్టిన కుమార్ సాయి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదే సమయంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు చేస్తున్న వ్యాఖ్యలు షోపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి.

కొంతమంది కుమార్ సాయిని ఇంటర్వ్యూ చేస్తూ బయట ఎంతో యాక్టివ్ గా ఉండే మీరు బిగ్ బాస్ హౌస్ లో యాక్టివ్ గా ఉండకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు కుమార్ సాయి స్పందిస్తూ ఇంట్లో తాను ఎన్నో స్కిట్లు చేసి హౌస్ మేట్స్ ను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందించానని అయితే తాను చేసిన ఆ స్కిట్లను ప్రసారం చేయలేదని కుమార్ సాయి కామెంట్ చేశాడు.

మార్నింగ్ మస్తీలో, టాస్కుల్లో భాగంగా హౌస్ మేట్స్ ను ఎంటర్టైన్ చేశానని అవి టెలీకాస్ట్ చేయలేదని తెలిపారు.

తాను తన కుటుంబ సభ్యుల గురించి చెప్పిన వీడియోను కూడా టెలీకాస్ట్ చేయలేదని అన్నారు.ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు కొందరు హౌస్ మేట్స్ విషయంలో ఒకలా మరి కొందరి విషయంలో మరోలా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా కుమార్ సాయి చేసిన వ్యాఖ్యలను బట్టి బిగ్ బాస్ షోలో కొందరు కంటెస్టెంట్ల విషయంలో కుట్ర జరుగుతోందని నెటిజన్లు వాపోతున్నారు.

#Footage #Kumar Sai #BiggBoss #Nagarjuna #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss 4 Contestant Kumar Sai Comments About Footage Related Telugu News,Photos/Pics,Images..