బిగ్‌బాస్ దివి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?  

bigg boss contestant divi vadthya personal life, Telugu Big Boss 4, Divi, Hyderabad, Divi Dady Hyderabad Central University Lab Technition, Divi Love Affair, Maharshi, Mahesh Babu - Telugu Divi, Divi Dady Hyderabad Central University Lab Technition, Divi Love Affair, Hyderabad, Maharshi, Mahesh Babu, Telugu Big Boss 4

బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ షోకు మరే షో సాటి రాదు.

TeluguStop.com - Bigg Boss 4 Contestant Diwi Personal Life

ఈ షోలో పాల్గొని తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అవకాశాలు సంపాదించుకున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు.అలా బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని కుర్రకారు హృదయాలను దోచుకున్న కంటెస్టెంట్లలో దివి ఒకరు.

మొదట్లో నోట్లో నాలుక ఉందా అన్న విధంగా ఉన్న దివి ప్రస్తుతం షోలో చేస్తున్న సందడి అంతాఇంతా కాదు.

TeluguStop.com - బిగ్‌బాస్ దివి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పలు వెబ్ సిరీస్ లలో నటించిన దివి మహేష్ బాబు మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించింది.

దివి పూర్తి పేరు దివి విద్య.కాలేజ్ లో ర్యాంప్ వాక్ చేసి మిస్ స్మైల్ గా ఎంపికైన దివి విద్య బీటెక్ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసింది.

పక్కా హైదరాబాదీ అయిన దివి పలు యాడ్స్, ఫ్యాషన్ షోలలో కూడా మెరిసింది.దివి నాన్న సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్ కాగా అమ్మ ప్రొఫెసర్.

కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని ప్రేమించిన దివి అతనితో బ్రేకప్ కావడంతో మానసికంగా కృంగిపోయింది.ఆ తరువాత తను సింగిల్ గా ఉంటోంది.దివి సింగిల్ గా ఉంటేనే జీవితం ఎంతో బాగుంటుందని.అతని ఫ్యామిలీ ఇష్యూ వల్ల బ్రేకప్ జరిగిందని చెప్పింది.

తను లవ్ చేసిన అబ్బాయి సొంత ఊరికి వెళ్లడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఆమె పేర్కొంది.బాయ్ ఫ్రెండ్ సినిమాలు వదిలేయమని చెప్పగా అతడి నిర్ణయం నచ్చక బాయ్ ఫ్రెండ్ నే వదిలేశానని ఆమె చెప్పుకొచ్చింది.

మహర్షి సినిమాలో మహేష్ ను ఫ్లర్ట్ చేసే రోల్ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని.మహేష్ లాంటి సూపర్ స్టార్ తో పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని ఆమె వెల్లడించింది.

హీరోయిన్ కావాలనే ఉద్దేశంతోనే మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించానని దివి చెప్పుకొచ్చింది.సోషల్ మీడియా ద్వారా దివి ఈ విషయాలను వెల్లడించింది.

#DiviDady #Mahesh Babu #Hyderabad #Divi #Maharshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss 4 Contestant Diwi Personal Life Related Telugu News,Photos/Pics,Images..