హీరో అయిపోయిన బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

సింగర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని విన్నర్ అయ్యారు.ఈ షో తర్వాత అతని పాపులారిటీ కూడా అమాతం పెరిగిపోయింది.

 Bigg Boss 3 Winner Rahul Sipligunj Turns Hero, Tollywood, Telugu Cinema, Ministe-TeluguStop.com

సింగర్ గా మంచి ఆఫర్స్ వచ్చాయి.అదే సమయంలో తన ఆల్బమ్స్ కి కూడా మంచి బ్రాండింగ్ వచ్చింది.

ఇదే జోరుగా రాహుల్ ఏకంగా నటుడుగా కూడా ప్రయాణం స్టార్ట్ చేసేశాడు.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పిలిచి మరీ రంగ మార్తాండ సినిమాలో రాహుల్ కి అవకాశం ఇచ్చారు.

ఈ సినిమాలో రాహుల్ ఓ కీలకపాత్రలో నటిస్తూ ఉండగా అతనికి జోడీగా రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక నటిస్తూ ఉండటం విశేషం.ఇదిలా ఉంటే రాహుల్ ఇప్పుడు పూర్తిస్థాయిలో హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది.

దీనికి సంబందించిన టైటిల్ సాంగ్ ని అతనే రాసి పాడాడు.తాజాగా ఈ సాంగ్ ని మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ఆర్.ఎస్.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మల్లిక్ కందుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాకు చిచ్చా అనే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ని, సాంగ్ విడుదల చేసారు.ఇక ఈ టైటిల్ సాంగ్ పక్కా తెలంగాణ మాస్ బీట్ తో సాగుతూ గల్లీ కుర్రాళ్ళ లైఫ్ ని తెరపై ఆవిష్కరించే విధంగా ఉంది.

తెలంగాణ లైఫ్ స్టైల్ లో ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే రాహుల్ తన మిత్రుడు శ్రీకాంత్‌తో కలిసి ఊకో కాకా బ్రాండ్ స్టోర్‌ని ని ప్రారంభించి బట్టల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube