లీక్‌ : బిగ్‌బాస్‌ 3లో అరుదైన సంఘటన నమోదు  

Bigg Boss 3 Telugu Seventh Week Elimination Leaked-bigg Boss 3 Telugu,nagarjuna,seventh Week Elimination

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి ఇప్పటికే అయిదుగురు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.మొదటి వారం హేమ, రెండవ వారం జాఫర్‌, మూడవ వారం తమన్నా, నాల్గవ వారం రోహిణి, అయిదవ వారం అషు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.ఆర వారం అయిన గత వారం నాగార్జున లేకపోవడంతో పాటు పండుగ అనే ఉద్దేశ్యంతో ఎలిమినేషన్‌ లేదు అంటూ రమ్యకృష్ణ ప్రకటించింది.ఇక ఏడవ వారంలో ఎలిమినేషన్‌లో అలీ, రవి, శ్రీముఖి, ఎప్పటిలాగే రాహుల్‌ మరియు మహేష్‌లు ఉన్నారు...

Bigg Boss 3 Telugu Seventh Week Elimination Leaked-bigg Boss 3 Telugu,nagarjuna,seventh Week Elimination-Bigg Boss 3 Telugu Seventh Week Elimination Leaked-Bigg Nagarjuna

ఈ వారంలో ఖచ్చితంగా మహేష్‌ లేదా రాహుల్‌లలో ఒకరు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అంటూ భావించారు.కాని అనూహ్యంగా అలీ రెజా ఎలిమినేట్‌ అయినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం అయిన ఆరు వారాల వరకు అలీ రెజా ఎలిమినేషన్స్‌కు రాలేదు.ఏదో ఒక కారణం వల్ల లేదా లక్కీగా అలీ ఆరు వారాల పాటు ఎలిమినేషన్స్‌ లో లేకుండా తన జర్నీని సాఫీగా సాగించాడు.

Bigg Boss 3 Telugu Seventh Week Elimination Leaked-bigg Boss 3 Telugu,nagarjuna,seventh Week Elimination-Bigg Boss 3 Telugu Seventh Week Elimination Leaked-Bigg Nagarjuna

అయితే మొదటి సారి ఏడవ వారంలో ఎలిమినేషన్స్‌కు నామినేట్‌ అయ్యాడు.ప్రేక్షకుల ముందుకు ఓట్ల కోసం వెళ్లిన అలీ ప్రేక్షకుల నుండి ఓట్లను రాబట్టడంలో విఫలం అయినట్లుగా సమాచారం అందుతోంది.నిన్నటి ఎపిసోడ్‌లో రాహుల్‌ను సేవ్‌ చేసినట్లుగా చూపించిన నాగార్జున నేటి ఎపిసోడ్‌లో అలీ రెజాను ఎలిమినేట్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించనున్నాడు.

నిన్ననే నేడు జరుగబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరిపారు.అందువల్ల నేడు ఏం జరుగబోతుందో అందరికి తెలిసి పోయింది.సోషల్‌ మీడియాలో అలీ రెజా ఎలిమినేట్‌ అంటూ పోస్ట్‌లు వస్తున్నాయి.షోకు హాజరు అయిన వారి నుండి ఈ విషయాలు బయటకు వెళ్తున్నాయి.

అలీ రెజా వియంలో జరిగిన విషయం బిగ్‌బాస్‌ చరిత్రలో జరిగి ఉండదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఏడు వారాల వరకు ఎలిమినేషన్‌ నామినేషన్స్‌కు రాకుండా ఉండి వచ్చిన వెంటనే ఎలిమినేట్‌ అవ్వడం బిగ్‌బాస్‌ చరిత్రలో రికార్డ్‌ అయ్యి ఉంటుంది.