బిగ్‌బాస్‌ బ్యూటీకి హీరోయిన్‌గా ప్రమోషన్‌

తెలుగు బిగ్‌ బాస్‌ వల్ల ఒక్కరు ఇద్దరుకు తప్ప ఎవరికి పెద్దగా గుర్తింపు రాలేదు.విన్నర్‌లుగా నిలిచిన శివ బాలాజీ, కౌశల్‌ మరియు రాహుల్‌ సిప్లిగంజ్‌లు స్టార్‌లు సూపర్‌ స్టార్‌లు అవ్వలేక పోయారు.

 Bigg Boss 3 Fame Himaja Going To Introduce  As Heroine With Ja Movie Himaja, Big-TeluguStop.com

రాహుల్‌ కాస్త పర్వాలేదు అనిపించినా ముఖ్యంగా ఇతర విజేతలు మాత్రం అంతకు ముందు ఉన్న స్టార్‌డంతో కూడా సినిమాల్లో కొనసాగలేక పోయారు.అయితే ఒక్కరు ఇద్దరు కంటెస్టెంట్స్‌ మాత్రం మద్యస్థంగా గుర్తింపు దక్కంచుకుని కాస్త తెలివితో సోషల్‌ మీడియా ద్వారా బిగ్‌ బాస్‌ తో వచ్చిన క్రేజ్‌ ను ఉపయోగించుకుని మరింతగా స్టార్‌డంను పెంచుకునే ప్రయత్నం చేశారు.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తో వచ్చిన క్రేజ్‌ ను హిమజ మరియు శివ జ్యోతిలు బాగా ఉపయోగించుకుంటున్నారు.శివ జ్యోతి ఇప్పటికే యూట్యూబ్‌ లో సందడి చేస్తుండగా హిమజ ఏకంగా హీరోయిన్‌ గా మారింది.

నేడు హిమజ పుట్టిన రోజు.ఈ సందర్బంగా ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ‘జ’ అనే సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు సంబంధించిన వివరాలను కూడా వెళ్లడించారు.థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యలు పేర్కొన్నారు.

జై దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో హిమజ విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది.త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి వీలు అయితే థియేటర్లలో లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ సినిమాకు సాది రెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో ఇతర నటీనటులు మరియు విడుదల విషయమై మరికొన్ని రోజుల్లో క్లారిటీ ఇస్తామంటూ ప్రకటించాడు.

బిగ్‌ బాస్‌ తో వచ్చిన క్రేజ్‌ ను ఈ అమ్మడు బాగానే క్యాష్‌ చేసుకుంటుంది.ఈ సినిమాతో సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకుంటే ఇకపై వరుసగా హిమజ హీరోయిన్‌గా నటించే అవకాశం లేకపోలేదు అంటూ కొందరు అంటున్నారు.

మరి హిమజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube