రెండోసారి పెళ్లి పీటలు ఎక్కిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూ ఉంది.హీరో హీరోయిన్లు నిర్మాతలు ఇలా క్యూ కడుతూ వారి బ్రహ్మచర్యాన్ని వదిలేసి పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు.

 Big Boss 2 Contestant Getting Married For The Second Time  Big Boss Fame, Social-TeluguStop.com

లాక్ డౌన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నిఖిల్, నితిన్, దగ్గుబాటి రానా అలాగే నిర్మాత దిల్ రాజు, వారం రోజుల క్రితం హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరూ కూడా ఒక ఇంటివారయ్యారు.అలాగే కొద్ది రోజుల్లో మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లి పీటలు లేకపోతోంది.

అసలు విషయంలోకి వెళితే.

తెలుగు లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వచ్చిన సామ్రాట్ రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సామ్రాట్ వరసకు అక్క అవుతున్న శిల్పారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఈ సందర్భంగా సామ్రాట్ ను పెళ్ళికొడుకు చేసిన ఫోటోలు, అలాగే పెళ్లి పీటల మీద ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

సామ్రాట్ విషయానికొస్తే.అతనికి ఈ పెళ్లి రెండవది.

ఇదివరకు మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్రాట్ రెడ్డి బావ, పంచాక్షరి, ఆహా నా పెళ్ళంట అనే సినిమాలలో నటించి మెప్పించాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.అయితే పెళ్లికూతురుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఎక్కడ తెలుపలేదు.ఎంతైనా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్నంత త్వరగా కొంతమంది విడాకులు కూడా తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది.ఇలా కేవలం కొంతమంది జంటలలో మాత్రమే కనబడుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ గా కొనసాగుతున్న హీరోలు అందరూ వారి కుటుంబ సభ్యులతో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube