వామ్మో.. బిగ్ బాస్ షోకు ఆ హోస్ట్ కు రూ.350 కోట్ల రెమ్యునరేషనా?

బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటని చెప్పవచ్చు.ఈ షో లో వివిధ భాషలలో సీజన్లను పూర్తి చేసుకుంటూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది.

 Bigg Boss 15 How Much Remuneration Will Salman Khan Get-TeluguStop.com

హిందీ, తమిళం, తెలుగు భాషలలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది ఈ కార్యక్రమం.ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో ఐదవ సీజన్ ప్రసారం కాగా.

హిందీలో ఏకంగా 14 సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తిచేసుకొని 15 వ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.హిందీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం నాలుగవ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు…

 Bigg Boss 15 How Much Remuneration Will Salman Khan Get-వామ్మో.. బిగ్ బాస్ షోకు ఆ హోస్ట్ కు రూ.350 కోట్ల రెమ్యునరేషనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 15 ను అక్టోబర్ నెలలో ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి సమాచారం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఈ కార్యక్రమానికి నాలుగవ సీజన్ నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అటువంటి సల్మాన్ ఖాన్ పారితోషికం భారీగా ఉంటుందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు ఏకంగా 350 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Telugu Bigg Boss 5, Bollywood, Remuneration, Salman Khan-Movie

ఈ లెక్కన చూసుకుంటే వారానికి సల్మాన్ ఖాన్ అందుకునే రెమ్యూనరేషన్ 25 కోట్లు.ఒక రియాల్టీ షో హోస్ట్ కి ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లించడం ఒక బిగ్ బాస్ కార్యక్రమానికి చెల్లింది.బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనంత రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి.అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన నాలుగవ సీజన్ కి కేవలం పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సల్మాన్ ఖాన్ 15వ సీజన్ కి ఏకంగా 350 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ఈయన పాపులారిటీ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ జంటగా టైగర్ 3 సినిమాతో బిజీగా ఉన్నారు.

#Bigg Boss #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు