అత్యాచారం కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి తండ్రి  

Bigg Boss 13 Contestant Shehnaz Gills Father Santokh - Telugu B-town, Bigg Boss 13 Contestant Shehnaz Gill\\'s Father Booked For Rape, Bollywood, Lock Down

బాలీవుడ్ లో నటిగా, గాయనిగా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ ద్వారా తన ఇమేజ్ ని పెంచుకున్న షెహనాజ్ గిల్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పుడు ఈమె తండ్రి చేసిన పని వలన ఈమె గురించి బీటౌన్లో అందరూ మాట్లాడుకుంటున్నారు.

 Bigg Boss 13 Contestant Shehnaz Gills Father Santokh

ఆమె తండ్రి సంతోఖ్ సింగ్ 20 ఏళ్ల అమ్మాయిని తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు.మే 14వ తేదీన ఈ దారుణం జరిగినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబం భయపడింది.

అయితే ఓ వ్యక్తి చొరవ తీసుకోవడంతో బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది.దీంతో రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అత్యాచారం కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి తండ్రి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఘటన బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

మే 14న బాధిత యువతి స్నేహితురాలితో కలసి మరో స్నేహితుడు సిద్ధూను కలవడానికి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్లింది.

వాళ్ళు గ్రామానికి చేరుకునే సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ తుపాకీ గురిపెట్టి ఆమెను కారులోకి తోశాడు.చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.తరువాత ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.ఇక త్వరలో అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss 13 Contestant Shehnaz Gills Father Booked For Rape Related Telugu News,Photos/Pics,Images..