అలాంటి వాళ్లకే సినిమా ఆఫర్లు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ప్రతిభ, అందం లేకపోయినా ఆఫర్లు వస్తే మరి కొందరికి మాత్రం అన్నీ ఉన్నా సినిమా ఆఫర్లు మాత్రం ఎక్కువగా రావు.హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొని గుర్తింపును సంపాదించుకున్న షెహనాజ్ గిల్ సిద్దార్థ్ శుక్లాతో రిలేషన్ షిప్ ద్వారా పలుమార్లు వార్తల్లో నిలుస్తున్నారు.

 Bigg Boss 13 Beauty  Shehanaaz Gill On Top Trending In Twitter, Movie Offers , S-TeluguStop.com

గతంలో బొద్దుగా ఉన్న షెహనాజ్ గిల్ స్లిమ్ గా మారి తాజాగా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచారు.

Telugu Bigg Boss, Offers, Shehanaaz, Siddarth Shukla, Top-Movie

తాజాగా షెహనాజ్ గిల్ బరువు తగ్గడంతో పాటు ఆహార నియమాలను ఏ విధంగా పాటించాలనే క్లారిటీ ఇచ్చారు.మ్యూజిక్ వీడియోలపై కూడా దృష్టి పెట్టిన షెహనాజ్ గిలీ ఆ వీడియోలు చేయడం ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు.తన బృందం ఉప్పు, చక్కెర తక్కువగా తింటే బరువు తగ్గవచ్చని ఎప్పటినుంచో చెబుతూ ఉండేదని తక్కువ తినడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చనే శ్రేయోభిలాషుల సలహాలను పాటించానని ఆమె చెప్పుకొచ్చారు.

ఉదయం సమయంలో తాను బ్రేక్ ఫాస్ట్ తో పాటు టీ తీసుకుంటానని మధ్యాహ్నం సమయంలో పప్పు, ఆకు కూరతో పాటు అన్నం తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. రాత్రి డిన్నర్ టైమ్ లో మిల్క్ తాగుతానని ఆమె చెప్పుకొచ్చారు.

ఒక అభిమాని స్లిమ్ గా ఉంటేనే అందంగా ఉంటానని కితాబిచ్చారని షెహనాజ్ గిల్ చెప్పుకొచ్చారు.తాను అనుకుంటే ఓల్డ్ లుక్ లోకి వెళ్లడం కష్టం కాదని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss, Offers, Shehanaaz, Siddarth Shukla, Top-Movie

అయితే తాను బరువు తగ్గడం వెనుక మరో కారణం కూడా ఉందని షెహనాజ్ గిల్ వెల్లడించారు.ఎవరైతే స్లిమ్ గా ఉంటారో వాళ్లకు ఇండస్ట్రీలో ఆఫర్లు సులభంగా వస్తాయని ఇండస్ట్రీలో సన్నజాజిలా ఉండేవాళ్లకు మాత్రమే గుర్తింపు ఎక్కువని షెహనాజ్ చెప్పుకొచ్చారు.అయితే సినిమా ఇండస్ట్రీలో బొద్దుగా ఉన్నా ఆఫర్లు సంపాదించుకోవచ్చని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube