బిగ్‌బాస్‌ మరో చెత్త వైల్డ్‌ నిర్ణయం, ప్రేక్షకుల రియాక్షన్‌ ఏంటో తెలుసా?  

Big Boss Another Wild Card Entry-ka Paul,nagarjuna,silpa Chakravarthy,sradha Das,tamanna Simhadri

తెలుగు బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌ ఏడవ వారంలోకి అడుగు పెట్టింది.దాదాపుగా సగం సీజన్‌ పూర్తి అయ్యింది.ఇలాంటి సమయంలో రెండవ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని తీసుకు రావడం జరిగింది.ఇలాంటి సమయంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటే చాలా పెద్ద స్టార్‌ అయితే కాని ప్రేక్షకులు ఆధరించడం కష్టం.అలాంటిది ఎప్పటి నుండో వస్తున్న శిల్ప చక్రవర్తిని ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి తీసుకు వచ్చారు.

Big Boss Another Wild Card Entry-ka Paul,nagarjuna,silpa Chakravarthy,sradha Das,tamanna Simhadri-Big Boss Another Wild Card Entry-Ka Paul Nagarjuna Silpa Chakravarthy Sradha Das Tamanna Simhadri

బిగ్‌బాస్‌ నిర్వాహకులు మొదటి వారం తర్వాత తమన్నా సింహాద్రీని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా తీసుకు వచ్చారు.

Big Boss Another Wild Card Entry-ka Paul,nagarjuna,silpa Chakravarthy,sradha Das,tamanna Simhadri-Big Boss Another Wild Card Entry-Ka Paul Nagarjuna Silpa Chakravarthy Sradha Das Tamanna Simhadri

తమన్నా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఎంతటి ఫ్లాప్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమన్నా చేసిన రచ్చ మర్చి పోయేందుకు కాస్త సమయం ఇచ్చిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఏడవ వారంలో రెండవ వైల్డ్‌ కార్డ్‌ను ఎంట్రీ ఇచ్చారు.

రెండవ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ గురించి ఏ స్థాయిలో చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కేఏ పాల్‌ నుండి శ్రద్దా దాస్‌ వరకు దాదాపు 15 మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి.కాని చివరి నిమిషంలో వరకు శిల్ప పేరు పెద్దగా చర్చకు రాలేదు.వారిలో ఎవరు వైల్డ్‌ ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అయ్యేవారు.కాని శిల్ప వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

శిల్ప చక్రవర్తి కారణంగా ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోల్పోతారేమో అనిపిస్తుంది.ఎందుకంటే చాలా వారాల పాటు ఇంట్లో ఉన్న సభ్యులు ఇప్పుడు ఒక వ్యక్తి వస్తే ఆమెను రిసీవ్‌ చేసుకునేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.ఆసమయంలో ప్రేక్షకులు కోరుకున్న మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

ఇక మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌ మరోసారి తన చెత్త నిర్ణయంతో ప్రేక్షకులకు పరీక్ష పెట్టినట్లు అయ్యిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.నాలుగు పదులు దాటిన శిల్ప చక్రవర్తిని ఇప్పుడు ఎవరు చూడాలని కోరుకోవడం లేదు.

ఆమెను తీసుకు రావడం ఏంటీ విడ్డూరంగా అంటూ టాక్‌ వినిపిస్తుంది