కళ్యాణ్ రామ్ బింబిసార నుంచి బిగ్ అప్డేట్?

Big Update From Kalyan Ram Bimbisara

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తారక రామారావు పతాకంపై హరికృష్ణ కే నిర్మిస్తున్నటువంటి చిత్రం బింబిసార.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

 Big Update From Kalyan Ram Bimbisara-TeluguStop.com

ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నింటికీ ఈ సినిమా ఎంతో విభిన్నమైనదని చెప్పవచ్చు.కళ్యాణ్ రామ్ 18 వ సినిమాగా ఒక మైథలాజికల్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే గతంలో ఈ సినిమా నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ క్రమంలో ఈ పోస్టర్ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

 Big Update From Kalyan Ram Bimbisara-కళ్యాణ్ రామ్ బింబిసార నుంచి బిగ్ అప్డేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు కూడా ఈ సినిమాని పూర్తిగా మరిచిపోయారు.ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి అప్డేట్ విడుదల చేశారు.

ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రోమో ద్వారా వెల్లడించారు.ఇక ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్ల పాత్రలో నటించగా ఈ సినిమా ద్వారా వశిష్ట అనే డైరెక్టర్ పరిచయం కానున్నారు.తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

#Varina Hissain #Samyuktha Menon #Bimbisara #Kalyan Ram #Move

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube