వైసీపీ ఎమ్మెల్యేకి గ‌ట్టి షాక్‌... ప‌క్క రాష్ట్రంలో క‌లుస్తామ‌ని వార్నింగ్ ?  

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి గ‌ట్టి షాక్ త‌గిలింది.త‌మ‌ను మోసం చేశారంటూ.

TeluguStop.com - Big Shock To Ycp Mla Warning That We Will Meet In The Neighboring State

నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆయ‌న‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.మ‌మ్మ‌ల్ని నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌మంటారా?  లేక‌.ప‌క్క‌రాష్ట్రంలో క‌లిసిపోమంటారా? అంటూ.స్థానికులు నిల‌దీశారు.

దీంతో ఎమ్మెల్యే ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.విష‌యంలోకి వెళ్తే.

TeluguStop.com - వైసీపీ ఎమ్మెల్యేకి గ‌ట్టి షాక్‌… ప‌క్క రాష్ట్రంలో క‌లుస్తామ‌ని వార్నింగ్ -Political-Telugu Tollywood Photo Image

విజ‌య‌న‌గ‌రం జిల్లా గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం.సాలూరు నుంచి విజ‌యం సాధించిన పీడిక రాజ‌న్న‌దొర‌.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డి గిరిజ‌నుల‌కు భారీ ఎత్తున హామీలు గుప్పించారు.

అయితే.

పార్టీ అధికారంలోకి వ‌చ్చినా. ఏడాదిన్న‌ర గ‌డిచిపోయినా.

ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు.పైగా గిరిజ‌నులు ఏ స‌మ‌స్య‌పై చ‌ర్చించాల‌ని భావించినా.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా దోబూచులాడుతున్నారు.దీంతో ఆగ్ర‌హించిన గిరిజ‌నులు ఇటీవ‌ల ఎమ్మెల్యే కార్యాల‌యాన్ని కూడా ముట్ట‌డించారు.

అయితే.అప్ప‌ట్లో న‌చ్చ‌జెప్పి పంపేసినా.

మ‌ళ్లీ స్థానిక స‌మ‌స్య‌ల‌పై గిరిజ‌నులు గ‌ళం వినిపించారు.తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని  గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు తెగేసి చెప్పారు.

Telugu A Big Shock, Ap, Ap Government, Ap Political News, Hot Topic, Latest News, Neighboring State, Rajanna Dora, Vijayanagaram, Warning, Ysrcp, Ysrcp Leaders-Telugu Political News

గత ఏడాది సెప్టెంబర్‌ 9న తమ పంచాయతీకి వచ్చినప్పుడు 70 రోజుల్లో పట్టుచెన్నారు- చింతచెట్టు జంక్షన్‌ నుంచి కొదమకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.మూడు నెలలు దాటినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని… ఎప్పుడు నిర్మిస్తారన్నారని ప్రశ్నించారు.తమ గ్రామం పక్కన ఉన్న ఒడిశా గ్రామాలకు ఆ ప్రభుత్వం రోడ్లు వేసిందని తెలిపారు.

రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిశాలో కలిసిపోతామన్నారు.

వారితో ఎమ్మెల్యే రాజన్నదొర చర్చలు జరిపారు.రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని, త్వరలోనే అనుమతి తీసుకుంటామని చెప్పారు.

రోడ్డు నిర్మించి.కొదమకు వస్తానని చెప్పారు.

మొత్తంగా ఈ ప‌రిణామం.వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది.

#YSRCP Leaders #Vijayanagaram #Ysrcp #AP Government #A Big Shock

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు