టాలీవుడ్ ప్రేక్షకులకు భారీ షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ సినిమాలు మాత్రమే దిక్కు అంటూ?

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల పెద్ద సినిమాల షూటింగ్ లు అంతకంతకూ ఆలస్యం కావడంతో పాటు ఆ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరిగాయి.గతేడాది డిసెంబర్ నెల నుంచి ఈ ఏడాది మె నెల వరకు పెద్ద సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.

 Big Shock To Tollywood Audience Details, Tollywood, Small Hero Movies, Blockbust-TeluguStop.com

అఖండ సినిమాతో పెద్ద సినిమాల హడావిడి మొదలు కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

బాలయ్య సినీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను అఖండ సినిమా సాధించడం గమనార్హం.

అఖండ విడుదలైన రెండు వారాల తర్వాత పుష్ప ది రైజ్ విడుదలై 2021 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు తొలిరోజు నెగిటివ్ టాక్ వచ్చినా వెండితెరపై, ఓటీటీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది జనవరిలో బంగార్రాజు విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు సినిమాకు 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

Telugu Acharya, Akhanda, Bangarraju, Big Shock, Blockbuster, Kgf, Khiladi, Pushp

తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లోనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా సక్సెస్ సాధించడంతో నాగార్జున ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ఖిలాడీ విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.మార్చి నెలలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ విడుదల కాగా రాధేశ్యామ్ ఫ్లాపైతే ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Telugu Acharya, Akhanda, Bangarraju, Big Shock, Blockbuster, Kgf, Khiladi, Pushp

ఏప్రిల్ నెలలో కేజీఎఫ్2, ఆచార్య విడుదల కాగా కేజీఎఫ్2 ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఆచార్య ఫ్లాప్ గా నిలిచింది.సర్కారు వారి పాట తుది ఫలితం తేలాల్సి ఉండగా ఎఫ్3 27వ తేదీన రిలీజ్ కానుంది.ఈ సినిమాతో ఈ ఏడాది విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు ముగిసినట్లేనని ఇకపై మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు ఆప్షన్ గా నిలుస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube