రాజేంద్రప్రసాద్‌కు షాక్‌

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో కీలక సంఘటన చోటు చేసుకుంది.మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న శివాజీ రాజా మరియు సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న ఉత్తేజ్‌లు తాము పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

 Big Shock To Rajendra Prasad-TeluguStop.com

గత కొన్ని రోజులుగా వీరు రాజేంద్ర ప్రసాద్‌ తరపున ప్రచారం కూడా నిర్వహించారు.అయితే ఉన్నట్లుండి ఎందుకు పోటీ నుండి తప్పుకుంటున్నారో అనే విషయంలో క్లారిటీ లేదు.

ముఖ్యులు అయిన శివాజీ రాజా మరియు ఉత్తేజ్‌లు పోటీ నుండి తప్పుకోవడంతో రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ బలహీనపడ్డట్లయ్యింది.రాజేంద్రప్రసాద్‌ ప్రత్యర్థి జయసుధ రోజు రోజుకు బలం పెంచుకుంటూ పోతుంది.

ఈ ఎన్నికల్లో జయసుధ విజయం ఖాయం అని ఆమె తరపున ప్రచారం చేస్తున్న ప్యానల్‌ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 29న జరుగబోతున్న ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube