చంద్రబాబు కి షాకుల మీద షాకులు..పార్టీని వీడనున్న చల్లా...

ఏపీ సీఎం చంద్రబాబు కి ఈ మధ్య అస్సలు టైం బాలేదు అని చెప్పాలి.ఒక్కొక్కరు ఒక్కో కారణంతో పార్టీని వీడుతున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది నాలుగైదు సార్లు ఎమ్మెల్యే గా చేసిన వాళ్ళే కావడం విశేషం.

 Big Shock To Chandrababu Naidu In Ap Politics-TeluguStop.com

అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జగన్ , పీకే ల పక్క వ్యూహంతో అధికార పక్షాన్ని ఆందోళనలో పడేయాలని తద్వారా చంద్రబాబు వెనుక ఉన్న నేతల్లో ఒక అస్తిరతని కలిగించాలనేది పక్కా వ్యూహంగా తెలుస్తోంది.


అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్న నేతలకి ముందు నుంచీ వైసీపి టచ్ లో ఉంటూ వస్తోంది.అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ‘కొండపి’ టిడిపి ఎమ్మెల్యే శ్రీబాలవీరాంజనేయస్వామి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.అయితే ఇదే విషయంపై కొండపి నియోజకవర్గ నేతలు సైతం ఈ విషయంపై అవుననే సమాధానాలు చెప్తున్నారు.

ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా వైసీపిలోకి వెళ్తున్నారు అనే వార్తలు రావడం తీవ్ర చర్చనీయంసం అయ్యింది.కొండపి ఎమ్మెల్యే స్వామి జూపూడి ప్రభాకర్ మీద ఐదు వేల ఓట్లు తేడాతో గెలుపొందారు.

ఆ తరువాత జూపూడి టిడిపిలోకి వెళ్ళడం అక్కడ నామినేటడ్ పదవి దక్కడం అన్నీ జరిగిపోయాయి అయితే.

ఇదిలాఉంటే ఆ మధ్య గుంటూరు జిల్లా నేతలు కొందరు టిడిపి నుంచీ వైసీపి లోకి మూకుమ్మడిగా వెళ్ళడం తో ఒక్క సారిగా చంద్రబాబు ఖంగుతిన్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా అంటే టిడిపికి కంచుకోట అలాంటి కోటలో టిడిపి వైసీపిలోకి చేరడం నిజంగా టిడిపికి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

ఇక ఈ పరిణామాలు అన్ని జరుగుతూ ఉన్న తరుణంలో మరొక వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఇదే గనుకా నిజం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు కి ఇది భారీ షాక్ అవ్వడం మాత్రం ఖాయం అంటున్నారు నేతలు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.

తాజాగా కర్నూలు జిల్లా సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి చంద్రబాబు పై తీవ్రమైన కోపంతో ఉన్నారట.

తనకంటే జూనియర్ కి రాయలసీమ ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంపై తీవ్ర అసంత్రుప్తిలో ఉన్నారట.ఇచ్చిన విషయంలో చంద్రబాబుపై మండిపోతున్నారు.జూనియర్ కు ఆర్టీసీ ఛైర్మన్ కట్టబెట్టి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన తనకు ఒక రీజియన్ స్ధాయి ఛైర్మన్ ఇచ్చి సరిపెడతారా అంటూ చంద్రబాబు ని నిలదీశారు.

అంతేకాదు ఆ పదవి తీసుకునేందుకు సిద్దంగా లేనని తెగేసి టిడిపిలో చేర్చుకునేటపుడే తనకు ఎంఎల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.

ఇప్పుడు మాట మార్చి నన్ను అవమాన పరిచారని అన్నారు.అంతేకాదు ఇక మీదట తానూ పార్టీలో కొనసాగానని ,పార్టీ కి తనకి ఎంటువంటి సంభంధం లేదనే ధోరణిలో ఉన్నారు, అడుగడుగునా అవమానాలు ఎదుర్కుంటున్నాను టిడిపిలో ఇక కొనసాగే ఆలోచన లేదు అనే పరిస్థితికి చల్లా వచ్చారని ఆయన మద్దతు దార్లు చెప్తున్నారు.

మరి చల్లా వైసీపి లోకి వెళ్తారా లేక కొత్త పార్టీ జనసేన కోలో వెళ్తారా ? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube