బీజేపి కి ఊహించని షాక్..ఇదే నిజమైతే   Big Shock To BJP     2018-03-24   02:43:48  IST  Bhanu C

బీజేపే ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో బీజేపి కి చావు దెబ్బ తగలడం ఖాయమేనా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు..బిజెపి అంతర్గతంగా చేసుకున్న సర్వేలో రిజల్ట్స్ చూసి మామూలు షాక్ తగలలేదట..

ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే…అధికార బిజెపికి 137 నుంచి 175 సీట్లు మాత్రమే వస్తాయని..ఆ పార్టీ మొత్తం అన్ని రాష్ట్రాలలో జరిగిపిన్ సర్వేల ప్రకారం ఒక పట్టికని రూపొందించింది..ఈ పట్టికలో ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నిసీట్లు.. ఉన్నాయి…రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాం…అనే సమగ్ర వివరాలు ఉన్నాయట..2014 ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు గెలిచాం..ప్రస్తుతం ఎన్ని గెలవబోతున్నాం…అనే విశ్లేషణ చేసుకున్నారట. ఎవరు ఎంతగా కష్టపడినా సరే మొత్తం మీద వారు గెలుపొందే సీట్లు కేవలం 175 అని తేలింది…
-

రాష్ట్రాల వారీగా గతం..భవిష్యత్తు సీట్ల మీద లెక్కలు వేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో గత ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుని ఆ పార్టీ రెండు సీట్లను గెలిచింది. ఈ సారి..ఆ రెండు సీట్లు కూడా రావని ఈ సర్వ్ తెల్చేసిందట..అంతేకాదు బిజెపి కి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి పట్టిన గతి పడుతుంది అంటున్నారు..దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌,పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, బీహార, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,ఒరిస్సా, తెలంగాణ, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపి కి ఎదురు గాలులు వీచడం ఖాయం అంటున్నారు..

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 75 సీట్లు గెలిస్తే…ఈ సారి బిజెపికి దక్కబోయేది 25 నుంచి 30 మాత్రమేనట…అంతేకాదు మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో గత సారి 26కు 26 గెలిస్తే…ఈసారి 10 స్థానాలు దక్కితే గొప్పే అంటున్నారు..కర్ణాటకలో గత ఎన్నికల్లో 17 స్థానాలు సాధిస్తే…ఈసారి 6కు మించవు. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి 27 స్థానాలు దక్కితే..ఈ సారి 10 నుంచి 17 మధ్యమాత్రమేనట. అయితే ఒరిస్సాలో మాత్రం బిజెపికి అనుకూల అవకాశాలు ఉంటాయి అంటున్నారు…బీహార్‌లో గత ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన బిజెపి ఈ సారి 10 నుంచి 20 స్థానాలు సాధించే ఛాన్స్‌ ఉందట…అయితే ఈ ఎఫెక్ట్ అంతా కేవలం ఏపీ కి మోడీ చేసిన అన్యాయం వలెనే జరిగిందని ఒక్క ఏపీ దెబ్బకి మోడీ గ్రాఫ్ దేసవ్యప్తంగా పడిపోయింది అనడానికి సాక్ష్యం ఈ సర్వ్ రిజల్ట్స్ అని అంటున్నారు..