టీడీపీ కి బిగ్ షాక్ కీలక నేత రాజీనామా..!!

తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయిన టీడీపీ పరిస్థితి ఏపీలో కూడా అదే స్థితి కి చేరుకున్నట్లు ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాల తరువాత విశ్లేషణలు వస్తున్నాయి.మున్సిపల్ కార్పొరేషన్ అదే రీతిలో పరిషత్ ఎన్నికలలో.

 Big Shock Key Leader Resigns For Tdp-TeluguStop.com

టీడీపీ పార్టీకి చెందిన నాయకులు ఘోరంగా ఓటమి పాలు కావడంతో.పలువురు నాయకులు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆయన చంద్రబాబు నాయుడుకి తన రాజీనామా లేఖను పంపడం జరిగింది.

 Big Shock Key Leader Resigns For Tdp-టీడీపీ కి బిగ్ షాక్ కీలక నేత రాజీనామా..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని అందువల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు లెటర్లో స్పష్టం చేశారు.అంత మాత్రమే కాక తన సేవలను పెద్దగా పార్టీ పట్టించుకోవడం లేదని.

తనను సరిగ్గా పరిగణలోకి తీసుకోవడంలేదని.అందువల్లే తాను గత ఏడాది నుండి పార్టీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆప్కో అభివృద్ధి కోసమే.తాను ఇంత కాలం టీడీపీలో ఉన్నట్లు .చంద్రబాబు ప్రభుత్వం ఆప్కొ విషయంలో పెద్దగా అభివృద్ధి చేయలేదని సహకరించలేదని చెప్పుకొచ్చారు.గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మురుగుడు హనుమంతరావు.

తాజాగా టీడీపీకీ రాజీనామా చేయటంతో.ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు