టక్ జగదీష్ డైరక్టర్ కు ఇది పెద్ద దెబ్బే..!

నాచురల్ స్టార్ నానితో నిన్ను కోరి సినిమా తీసి హిట్ అందుకున్న శివ నిర్వాణ.మొదటి సినిమానే అనుకున్నది అనుకున్నట్టుగా తీశాడు ఇక 3వ సినిమా ఎలా తీస్తాడో అని అతను చెప్పిన కథ మీదనే గురి పెట్టి ఆ నమ్మకంతో టక్ జగదీష్ సినిమా చేశాడు నాని.

 Big Shock For Nani Tuck Jagadish Director Shiva Nirvana, Director Shiva Nirvana-TeluguStop.com

అయితే శివ ఎలా చెప్పి ఈ సినిమా ఒప్పించాడో కాని ఈ సినిమా ఓటీటీ రిలీజై మంచి పని చేశారని చెప్పుకుంటున్నారు.సినిమా ఆహా ఓహో అని ఊరించి సినిమా చూశాక పెద్దగా విషయం ఏమి లేదని పెదవి విరిచేశారు ఆడియెన్స్.

ఈ క్రమంలో టక్ జగదీష్ వల్ల హీరో నానికి పెద్దగా నష్టమేమి ఉండదు కాని ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేసిన శివ నిర్వాణకు మాత్రం దెబ్బ పడేలా ఉంది.హిట్లు పడితేనే ఎక్కడైనా అవకాశాలు వస్తాయి.

అలాంటిది నానితో ఫ్లాప్ తీసిన శివ నిర్వాణకు విజయ్ ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా తర్వాత విజయ్, శివ నిర్వాణ మూవీ ఉంటుందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube