భారతీయులకు విడాకులు ఇచ్చే విదేశీయులకు బిగ్ షాక్....కేంద్రం కీలక నిర్ణయం

ఎల్లలు దాటి విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ఎంతో మంది భారతీయులు అక్కడి సంస్కృతి, పరిస్థితులకు అలవాటు అవ్వడమే కాకుండా స్థానికంగా ఉండే వారిని ప్రేమించి వారిని భారత్ లోని తమ సొంత ప్రాంతాలకు తీసుకువెళ్లి మరీ వారి వారి సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి చేసుకుకుంటున్నారు.ఈ క్రమంలో వారు మన భారత్ లోకి వచ్చే సమయంలో భారత్ లోకి అడుగు పెట్టడానికి ప్రభుత్వం ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI ) హక్కును కల్పిస్తుంది.

 Big Shock For Foreigners Divorcing Indians Center Is Key, Overseas Citizens Of I-TeluguStop.com

ఈ కార్డ్ ద్వారా భారత్ వచ్చే భారతీయ ఎన్నారైలకు ఎలాంటి హోదా ఉంటుందో అలాంటి హోదానే వారి జీవిత భాగస్వాములకు కూడా దక్కుతుంది.

అయితే భారతీయులను పెళ్లి చేసుకుని తరువాత ఎలాంటి మనస్పర్ధలు వచ్చి విడాకులు విడాకులు ఇచ్చినా వెంటనే విదేశీయులకు ఇచ్చిన OCI కార్డ్ రద్దు అవుతుందని కేంద్రం ప్రకటించింది.

అయితే ఈ చట్టాన్ని కొత్తగా తీసుకురాలేదు భారత పౌరసత్వ చట్టంలో సెక్షన్ -7డి (ఎఫ్) లో ఈ చట్టం గురించి వివరించి ఉంది.అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే.

భారతీయ పౌరుడిని పెళ్ళాడిన బెల్జియంకు చెందిన మహిళ కొంత కాలం తరువాత భర్త నుంచి విడాకులు తీసుకుంది.ఈ విషయం తెలుసుకున్న బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం OCI కార్డ్ ఇచ్చేయలాని సదరు మహిళను కోరింది.

అయితే కార్డ్ ఇవ్వడానికి అంగీకరించకపోగా భారత్ లోని ఢిల్లీ హై కోర్టు లో కేసు వేసింది.ఆమెకు ఎందుకు ఈ హోదాను ఇవ్వకూడదు అంటూ కోర్టు ప్రశ్నించడంతో భారత హోమ్ మంత్రిత్వశాఖ సెక్షన్ -7డి (ఎఫ్) ను కోర్టు ముందు ఉంచింది.

ఈ సెక్షన్ ప్రకారం ఆమె ఇప్పుడు OCI కార్డ్ పొందటానికి అర్హురాలు కాదని ఆమె వెంటనే ప్రభుత్వానికి కార్డ్ అందజేయాలని ఒక వేళ ఆమె అందుకు అంగీకరించని పక్షంలో కార్డ్ ను రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube