ట్రంప్ ని సవాల్ చేసే హక్కు మీకు లేదు..అమెరికా కోర్టు సంచలన తీర్పు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెక్సికో సరిహద్దు కి నిధులు మంజూరు చేయాలని ఇచ్చిన ప్రతిపాదనలని సవాల్ చేస్తూ అమెరికన్ కాంగ్రెస్ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు, వాదోపావాదాలు విన్న తరువాత అసలు అమెరికన్ కాంగ్రెస్ కి అమెరికా దేశాధ్యక్షుడి నిర్ణయాలని సవాలు చేసే అధికారం లేదని స్పష్టం చేసింది.

 Big Shock For American Congress-TeluguStop.com

ఈ మేరకు జడ్జ్ ట్రెవెర్‌ మెక్‌ ఫాడెన్‌ ఈ పిటిషన్ ని కొట్టిపారేశారు.

ఇదిలాఉంటే ఈ కేసుని సియెర్రా క్లబ్‌, సదర్న్ బోర్డర్ కమ్యునిటీస్ తరుపున, అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ దాఖలు చేసింది.

ట్రంప్‌ ప్రతిపాదనను సవాలు చేస్తూ దాఖలు చేసిన ప్రతినిధుల సభ పిటిషన్‌ న్యాయవ్యవస్థని , వారికి అధ్యక్షుడికి మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలోకి లాగడానికి ఉద్దేశించినదిగా పేర్కొంది.అధ్యక్షుడిని సవాలు చేసే అధికారం పిటిషనర్ కి లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

ట్రంప్ ని సవాల్ చేసే హక్కు మీక

అంతేకాదు మీరు అనుసరించే వైఖరి సరైనది కాదూ అంటూ అమెరికన్ కాంగ్రెస్ కి చురకలు అంటించారు న్యాయమూర్తి.చట్టాల అమలుపై న్యాయవ్యవస్థ పర్యవేక్షణ అందులో భాగం కాదని స్పష్టం చేశారు.ఈ తీర్పుపై అమెరికా న్యాయశాఖ రాజకీయాలని కోర్టులకి లాగడం సరైనది కాదని ట్విట్టర్ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube