విశాఖపట్నంలో డొల్ల కంపెనీల భాగోతం బట్ట బయలు! 70 వరకు షెల్ కంపెనీలు!  

హైదరాబాద్, విశాఖ కేంద్రంగా డొల్ల కంపెనీలు భారీ కుంభకోణం. .

Big Scam With Shell Companies In Vizag And Hyderabad-big Scam,gst,hyderabad,indian Economic,modi,shell Companies,telangana,vizag

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారని, అలాగే పెట్టుబడుల ఒప్పందం అంటూ ఎప్పటికప్పుడు మీటింగ్ లు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాడు. అయితే ఇలా ఎంఓయూ చేసుకొని విశాఖ కేంద్రంగా చాలా డొల్ల కంపెనీలు నడుస్తున్నట్లు బయట పడింది. ఈ షెల్ కంపెనీల మాటున భారీ కుభాకోణం కూడా జరిగినట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ బయట పెట్టింది...

విశాఖపట్నంలో డొల్ల కంపెనీల భాగోతం బట్ట బయలు! 70 వరకు షెల్ కంపెనీలు!-Big Scam With Shell Companies In Vizag And Hyderabad

నకిలీ ఇన్ వాయిస్ లని పెట్టి ఈ కంపెనీలు భారీ మోసానికి తెరతీసాయని గుర్తుంచారు.

ఈ కుంభకోణంలో హైదరాబాద్ కేంద్రం 8 షెల్ కంపెనీలు వుంటే, విశాఖ కేంద్రంగా సుమారు 70 వరకు షెల్ కంపెనీలు వున్నాయని జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలు సుమారు 1284 కోట్లు వ్యాపారం జరిగినట్లు చూపించి 224 కోట్లు ఐటీసి నుంచి పొందినట్లు గుర్తించారు. ఇక వీటిపై త్వరలోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని జీఎస్టీ అధికారులు స్పష్టం చేసారు. మరి ఈ కంపెనీలు ఎవరివి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం వుంది.