విశాఖపట్నంలో డొల్ల కంపెనీల భాగోతం బట్ట బయలు! 70 వరకు షెల్ కంపెనీలు!

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారని, అలాగే పెట్టుబడుల ఒప్పందం అంటూ ఎప్పటికప్పుడు మీటింగ్ లు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాడు.అయితే ఇలా ఎంఓయూ చేసుకొని విశాఖ కేంద్రంగా చాలా డొల్ల కంపెనీలు నడుస్తున్నట్లు బయట పడింది.

 Big Scam With Shell Companies In Vizag And Hyderabad-TeluguStop.com

ఈ షెల్ కంపెనీల మాటున భారీ కుభాకోణం కూడా జరిగినట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ బయట పెట్టింది.నకిలీ ఇన్ వాయిస్ లని పెట్టి ఈ కంపెనీలు భారీ మోసానికి తెరతీసాయని గుర్తుంచారు.

ఈ కుంభకోణంలో హైదరాబాద్ కేంద్రం 8 షెల్ కంపెనీలు వుంటే, విశాఖ కేంద్రంగా సుమారు 70 వరకు షెల్ కంపెనీలు వున్నాయని జీఎస్టీ అధికారులు గుర్తించారు.ఈ కంపెనీలు సుమారు 1284 కోట్లు వ్యాపారం జరిగినట్లు చూపించి 224 కోట్లు ఐటీసి నుంచి పొందినట్లు గుర్తించారు.

ఇక వీటిపై త్వరలోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని జీఎస్టీ అధికారులు స్పష్టం చేసారు.మరి ఈ కంపెనీలు ఎవరివి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube