అసాధ్యం సుసాధ్యం.. దేశంలో ఏ సీఎంకు లేని బిగ్ రికార్డ్‌...!

అధికారంలోకి వ‌చ్చిన యేడాదిన్న‌ర కాలంలోనే ఎన్నో సంచ‌లన నిర్ణ‌యాల‌తో దూసుకుపోతోన్న ఏపీ సీఎం జ‌గ‌న్ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించారు.దేశంలో ఏ రాష్ట్రం సీఎం సృష్టించ‌లేని విధంగా తిరుగులేని రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నారు.

 Big Record That No Cm In The Country Has, Ap Cm, Jagan, Ys Jagan, Ysrcp, Ysrcp P-TeluguStop.com

ఈ నెల 25న ప్రారంభిస్తోన్న ప‌థ‌కంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది.రాష్ట్రంలో ఆ రోజు ఏకంగా  30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేసే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు.

ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మం నాలుగు సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న ఇళ్ల ప‌ట్టాల‌తో ఇళ్ల నిర్మాణం కూడా అదే రోజు ప్రారంభిస్తున్నారు.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి కార్య‌క్ర‌మం ఏ సీఎం చేయ‌క‌పోగా… భ‌విష్య‌త్తులో కూడా చేస్తారా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే జ‌గ‌న్ తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 25 ల‌క్ష‌ల ఇళ్ల‌ను క‌ట్టించి ఇస్తాన‌ని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన‌ప్పుడు చాలా మంది అప‌హాస్యం చేశారు.

Telugu Lakhs, Ap Cm, Cm, Craze, Times, India, Jagan, Manifesto, Ys Jagan, Yscrp,

రాష్ట్రంలో ఎన్నో ఖాళీ భూముల‌కు అనుమ‌తులు రావ‌డం మామూలు విష‌యం కాదు.అలాంటిది జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే ప్రభుత్వ భూములు ఎక్క‌డ ఉన్నాయో గుర్తించి వెంట‌నే వాటిని ప్లాట్లుగా విభ‌జించి ల‌బ్ధిదారుల‌ను గుర్తించి వారికి కేటాయించారు.ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములతో పాటు.దాదాపు 20 వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొని ఈ పంపిణీ చేస్తున్నారు.ఓవ‌రాల్‌గా రాష్ట్రంలో ఎంతో మంది పేద‌ల‌కు ఈ ఇళ్ల నిర్మాణంతో ల‌బ్ధి జ‌రుగుతోంది.

రాష్ట్రంలో ఇళ్లు లేని వారు అంటూ ఉండ‌కూడ‌దు అన్న‌దే సీఎం ల‌క్ష్యం.

ఈ కార్య‌క్ర‌మం పూర్త‌య్యాక ఏపీలో జ‌గ‌న్ క్రేజ్ మ‌రింత‌గా పెరుగుతుంద‌ని కూడా రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube