అమెరికాలో భారీ కొండచిలువ..ఎలా పట్టుకున్నారో తెలుసా..!!!  

Big Python In America-

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 17 అడుగుల పొడవు ఉన్న అత్యంత భారీ కొండచిలువని పరిశోధకులు పట్టుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో రాష్ట్రంలో దాదాపు 140 పౌండ్లు బరువుతో కడుపులో దాదాపు 73 గుడ్లు కలిగి ఉన్న ఈ కొండ చిలువ పరిశోధకుల చేతికి చిక్కింది అయితే ఈ కొండచిలువని పట్టుకోవడానికి వారు ఏమి చేసారో తెలుస్తే షాక్ అవుతారు..

అమెరికాలో భారీ కొండచిలువ..ఎలా పట్టుకున్నారో తెలుసా..!!!-Big Python In America

ఈ అభయారణ్యంలో రోజు రోజుకి వీటి సంఖ్య పెరిగిపోవడంతో అడవిలో ఉన్న ప్రాణులు వీటి ఆకలికి బలై పోతున్నాయి దాంతో ఆందోళన చెందినా పరిశోధకులు వీటిని పట్టి చంపే పనిలో ఉన్నారట. ఇదిలాఉంటే వీటిని పట్టుకోవడానికి ఓ మగ కొండ చిలువని ఎరగా వేస్తున్నారట. మగ కొండ చిలువకి రేడియో ట్రాన్స్‌మిటర్స్‌ను వాడటం ద్వారా శాస్త్రవేత్తలు పైథాన్‌ల జాడ పసిగట్టారని తెలిపింది.

దక్షిణ ఫ్లోరిడాలోని అటవీ ప్రాంతంలో దాదాపు 3 లక్షలకి పైగా కొండచిలువలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారట దాంతో ఇప్పుడు ఆడ కొండ చిలువలని పట్టుకుని చంపే పనిలో పడ్డారు అధికారులు.