'బిగ్ బాస్ హౌస్' నుండి 'కౌశల్' ను పంపించేయడానికి ఇంత పెద్ద స్కెచ్ వేస్తున్నారా.?  

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు. మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది. కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి. ఇక కౌశల్ ఆర్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. ఇటీవలే కౌశల్ కి సపోర్ట్ గా 2 కె రన్ కూడా నిర్వహించారు హైదరాబాద్ లో.

Big Plan For Kaushal Elimination In Bigg Boss 2-

Big Plan For Kaushal Elimination In Bigg Boss 2

మొత్తానికి బిగ్‌బాస్ షో మాత్రం అతనికి ఊహించని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. కౌశల్ బిగ్‌బాస్ సీజన్‌ 2కి సైన్ చేసినపుడు చివరి వరకూ ఉండి విన్నర్ అవ్వాలనే లక్ష్యంతోనే చేసి ఉంటాడు. షోలో కూడా అతని అడుగులు లక్ష్యం వైపే పడ్డాయి. ‘నేను బంధాలను పెట్టుకోవడానికి రాలేదు.. గేమ్ కోసం వచ్చాను’ అంటూ తన లక్ష్యాన్ని ఎన్నో సందర్భాల్లో హౌస్‌మేట్స్‌కి వెల్లడించాడు కూడా.

అయితే అతడిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు సన్నాహాలు జరిగిపోతున్నాయంటూ వార్తలు వినవస్తున్నాయి. చివరి వారంలో కౌశల్‌తో ఇంట్రెస్టింగ్ గేమ్‌ని ఆడించబోతోందట బిగ్‌బాస్. దాని పేరు ‘రూలర్ గేమ్’. ఈ గేమ్‌లో హౌస్‌ని బిగ్‌బాస్ సిటీగా మార్చి హౌస్‌మేట్స్‌ని ప్రజలుగా.. కౌశల్‌ని కింగ్‌గా ప్రకటించనుందట. హౌస్‌మేట్స్ అంతా కింగ్ చెప్పినదాన్ని తూ.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కాదని ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలను కింగ్ విధించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ద్వారా కౌశల్‌ని ఎలిమినేట్ చేసేందుకు లేదంటే అతని క్రేజ్‌ను తగ్గించేందుకు యత్నిస్తోందట బిగ్‌బాస్ టీం.

Big Plan For Kaushal Elimination In Bigg Boss 2-

కింగ్‌ని బిగ్‌బాస్ గైడ్ చేస్తూ ఉంటారు. హౌస్‌మేట్స్‌తో చేయించుకోవాల్సిన పనులు.. వారు ఎదురు తిరిగితే విధించాల్సిన శిక్షలు మొదలైన వాటన్నింటినీ బిగ్‌బాస్ గైడ్ చేస్తారు. చేయించే పనులు… విధించే శిక్షల కారణంగా చూస్తున్న ప్రేక్షకుల్లో హౌస్‌మేట్స్‌పై సింపతి వర్కవుట్ అయి… కింగ్‌పై ద్వేషం కలగక మానదు. కాబట్టి కౌశల్‌ని ఈ టాస్క్‌లో భాగంగా కింగ్‌ని చేసి ఎలిమినేట్ చేయాలనో లేదంటే అతని క్రేజ్‌ను భారీగా తగ్గించేయాలనో బిగ్‌బాస్ టీం యోచన చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ గేమ్‌ను హిందీలో సీజన్ 8లో విపరీతమైన క్రేజ్ ఉన్న గౌతమ్ గులాటీతో ఆడించారు. ఈ టాస్క్ కారణంగా హౌస్‌మేట్స్ అంతా అతనికి యాంటీ అయ్యారు. మిగిలిన హౌస్‌మేట్స్‌పై బయట సింపతి బాగా వర్కవుట్ అయింది. ఫినాలేలో గౌతమ్ విన్నర్ అయినా ఓట్లు మాత్రం భారీగా స్ప్లిట్ అయ్యాయి. తమిళ్‌లో కూడా ఐశ్వర్యా దత్తతో ఆడించారు. దీంతో ఆమెకు బయట బాగా వ్యతిరేకత వచ్చింది. మిగిలిన హౌస్‌మేట్స్‌పై సింపతి వర్కవుట్ అయింది. దీనినే మరాఠీ బిగ్‌బాస్‌లో కూడా ఆడించారు. ఇక్కడ కూడా సేమ్ జరిగింది.