చంద్ర‌బాబుకు శ‌త్రువు చంద్ర‌బాబేనా

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును దేశంలోనే అప‌ర రాజ‌కీయ చాణుక్యుళ్ల‌లో ఒక‌డిగా పిలుస్తారు.గ‌తంలో చంద్ర‌బాబు సీఎం చేసిన‌ప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న పోషించిన కీ రోల్‌కు ఎంతోమంది జాతీయ నాయ‌కులు సైతం ఫిదా అవ్వ‌క తప్ప‌లేదు.

 Big Notes Ban Effect On Chandrababu-TeluguStop.com

త‌ర్వాత ఆయ‌న వేసిన రాంగ్ స్టెప్‌ల‌తో ప‌దేళ్ల పాటు అధికారానికి దూర‌మ‌య్యారు.తిరిగి ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న ఆయ‌న మ‌రోసారి రాంగ్ స్టెప్‌ల‌తో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కొని తెచ్చుకుంటున్నారా ? అంటే రాజ‌కీయ‌వ‌ర్గాలు అవుననే అంచ‌నా వేస్తున్నాయి.

తాజాగా ఏపీలో గ‌త 10 రోజుల్లో జ‌రిగిన ప‌రిణామాలు బాబు వైఖరిని మార్చేశాయి.ఈ నెల 8వ తేదీన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్ర‌బాబు తాను పెద్ద నోట్లు ర‌ద్దు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో పోరాటం చేస్తున్నాన‌ని…త‌న వ‌ల్లే ఈ నోట్లు ర‌ద్ద‌య్యాయ‌న్న బిల్డ‌ప్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.ఇదంతా త‌న‌కు చాలా పాజిటివ్ అవుతుంద‌ని ఆయ‌న లెక్క‌లు ఆయ‌న వేసుకున్నారు.

ఈ నోట్ల ర‌ద్దుపై ఒక‌టి రెండు రోజులు స్పంద‌న బాగానే ఉంది.ఆ త‌ర్వాత సామాన్య ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌డుతూ అటు మోడీని, ఇటు చంద్రబాబును విమ‌ర్శించ‌డం స్టార్ట్ చేశారు.

బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో ఉంటున్నా నాలుగు వేలు కూడా చేతికి రాక‌పోవ‌డంతో వారిలో అస‌హ‌నం తీవ్ర‌మైంది.ఈ ఎఫెక్ట్‌ను మంత్రులు, ఎంపీలు, ప్ర‌జా ప్ర‌తినిధులు చంద్ర‌బాబుకు వెంట‌నే చేర‌వేశారు.

ఇదే విష‌యంలో ప‌క్క తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్ట‌డంతో పాటు ఇదో ప‌నికిమాలిన చ‌ర్య‌గా ఎద్దేవా చేశారు.నోట్ల ర‌ద్దుపై తాను వేసిన బాణం రివ‌ర్స్ అవుతుండ‌డంతో చంద్ర‌బాబు యూ ట‌ర్న్ తీసుకున్నారు.

పెద్ద నోట్లు ర‌ద్దు చేసే విష‌యంలో కేంద్రం ముందుగా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌డంలో ఫెయిల్ అయ్యింద‌ని బాబు చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో తేల‌డంతో బాబు వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ విష‌యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు సైతం మౌనంగానే ఉన్నారు.

బాబు అన‌వ‌స‌రంగా తొంద‌ర ప‌డ్డారా ? అన్న సందేహాలు టీడీపీ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు.ఇక ప్రధాని మోడీ కేసీఆర్‌తో మాట్లాడి ఢిల్లీకి పిలిపించుకున్నారు.

కేసీఆర్‌లా బాబు వ్యూహాత్మ‌కంగా ఆలోచించ‌కుండా తొంద‌ర‌ప‌డి రాంగ్ స్టెప్ వేశారా ? అన్న డౌట్లే ఎక్కువుగా వ‌స్తున్నాయి.ఈ నోట్ల ర‌ద్దు వ‌ల్ల ధీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు చెపుతున్నా ఆయ‌న మాట‌లు ప‌ట్టించుకునే వారే లేరు.

దీంతో 2004లో హైటెక్ సీఎంను అన్న ప్ర‌చారం ఓవ‌ర్‌గా చేసుకుని దెబ్బ‌తిన్న చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రోసారి అదే పంథాలో వెళుతూ ఆయ‌న‌కు ఆయ‌నే శ‌త్రువుగా మారుతున్నాడా ? అన్న డౌట్లు సొంత పార్టీ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube