ఓ థియేటర్లో 52 మంది కూర్చోని సినిమా చూస్తే ఎలా ఉంటుంది? థియేటర్ అంతా ఖాలిగా ఏం బాగుంటుంది కదా! అదే ఒక్కో షోలో 2-3 మంది కూర్చోని చూస్తే ఎలా ఉంటుంది? హీరోకి – నిర్మాత – దర్శకుడు .ముగ్గురికి దాదాపు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనవుతుంది కదా.
ఇలాంటి విచిత్రం ఆది నటించిన చుట్టాలబ్బాయి విడుదలకి జరిగింది.
విషయంలోకి వెళ్తే, మన తెలుగు సినిమాలకి అమెరికాలో ప్రీమియర్స్ వేస్తారని తెలుసు కదా.ఆది సినిమాలేవి ఓవర్సీస్ లో బాగా ఆడకపోయినా, ఆశతో 20 ప్రీమియర్ షోలు వేసారు చుట్టాలబ్బాయి చిత్రానికి.అన్ని షోలు కలిపితే 52 మంది చుట్టాలబ్బాయి సినిమాని చూసారు.
అంటే ఒక్కో షోలో సగటున 2-3 మంది కూర్చున్నారన్న మాట.ప్రీమియర్ షోలకి వచ్చిన గ్రాస్ కలెక్షన్ 40 వేల రూపాయలు.కాస్త వ్యంగంగా మాట్లాడితే, ఇదో ఆల్ టైమ్ రికార్డు అన్నమాట.
తెలుగు రాష్ట్రల్లోనే రొటీన్ రొట్ట సినిమాలకి ఆదరణ కరువైపోతున్బ తరుణంలో, చుట్టాలబ్బాయి లాంటి సినిమాకి ఓవర్సీస్ లో ప్రిమియర్స్ వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో.
ఈరకంగా ఘోరమైన అవమానాన్ని చవిచూసాడు హీరో ఆది.సరే, తెలుగు రాష్ట్రాల్లోనైనా ఈ సినిమా పరిస్థితి ఏమైనా బాగుందా అంటే .అది కూడా లేదు.