బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం తెలుగు హిందీ తమిళ భాషలలో ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాదరణ దక్కించు కుంది.
ఇప్పటికే అన్ని భాషలలో సీజన్లను పూర్తి చేసుకొని ఎంతో విజయ వంతంగా దూసుకు పోతున్న ఈ కార్యక్రమం ఏకంగా హిందీలో 15 సీజన్లలో పూర్తి చేసుకుంది.ఈ సీజన్ జనవరి 30వ తేదీ ఎంతో దిగ్విజయంగా గ్రాండ్ ఫినాలే పూర్తి చేసుకుంది.
ఈ సీజన్ లో బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న తేజస్వి ప్రకాష్ టైటిల్ గెలుచుకున్నారు.టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో పోటీ పడగా ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్ కి పట్టం కట్టారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన బిగ్ బాస్ హౌస్ ను ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ సెట్ లో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా బిగ్ బాస్ నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.ఇలా ఉన్నఫలంగా మంటలు రావడంతో వెంటనే నిర్వాహకులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయడంతో వెంటనే 4 ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను ఆర్పేశారు.అయితే ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.లేదంటే చాలా ప్రమాదం జరిగేదని అయినా ఇలా ఉన్నఫలంగా మంటలు వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటి అనే విషయం తెలియాల్సి ఉంది.