ఇదేందయ్యా ఇది : ఇక  నుంచి హెయిర్ కటింగ్ కి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలట…  

Big Decision Hair Cutting Tamil Nadu - Telugu Adhar Card, Big Decision, Hair Cutting, Hair Saloon, Tamil Nadu Government

మామూలుగా మన దేశంలో ఆధార్ కార్డు ని ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తిగత పనుల నిమిత్తం, అలాగే గుర్తింపు కార్డుగా ఉపయోగించడం చూస్తుంటాం.కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంకొని తచుమిళనాడు రాష్ట్రం హెయిర్ కటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

 Big Decision Hair Cutting Tamil Nadu

అయితే దాదాపుగా గత రెండు నెలల కాలం పాటు దేశంలో కరోనా వైరస్ వ్యాశాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ లో భాగంగా హెయిర్ సెలూన్లు మరియు ఇతర బ్యూటీ పార్లర్ వంటివి జన సాంద్రత ప్రదేశాలను మూసివేరు.

కాగా ఇటీవలే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సడలింపులు చేపట్టారు.దీంతో తాజాగా కటింగ్ షాపులు మరియు బ్యూటీ పార్లర్ వంటివి తెరిచారు.

ఇదేందయ్యా ఇది : ఇక  నుంచి హెయిర్ కటింగ్ కి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలట…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో జనాలు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా కటింగ్ షాపులకు వెళుతున్నారు.ఇది గమనించిన కొందరు ప్రభుత్వ అధికారులు ఇలా ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా వెళితే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని, ఇక నుంచి హెయిర్ కటింగ్  చేయించుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుపోవాలని అంతేగాక ముందుగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారట.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా పలువురు నెటిజన్లు హెయిర్ కటింగ్ షాప్ లో ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం ఏంటో విడ్డురం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంతమంది మాత్రం ఆధార్ కార్డు ద్వారా కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను సులభంగా గుర్తించ వచ్చని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Decision Hair Cutting Tamil Nadu Related Telugu News,Photos/Pics,Images..

footer-test