దేశం సీటు కోసం పెద్ద‌ల `క్యూ

టీడీపీ తరఫున రాజ్యసభకు తెలంగాణ వారికి అవ‌కాశాలు లేవ‌ని, భార‌తీయ జ‌న‌తా పార్టీ సైతం సీటు కోర‌లేదంటూ తెలుగుదేశం పార్టీ ్ర‌ప‌థాన కార్య‌దర్శి నారా లోకేఫ్ ్ర‌ప‌క‌ట‌న ఆశా వాహుల‌లో కొత్త ఆశ‌లు చిగురింప చేసాయి.ఏపీ కోటాలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఈ నెల 31తో నామినేషన్ల దాఖ‌లు చేయాలి.

 Big Competition In Tdp For Rajyasabha Seats?-TeluguStop.com

ఈ గడువు ముందే తమ బెర్తులను ఖరారు చే సుకోవాలని సీనియర్లు కొందరు రంగంలోకి దిగినట్లు సమాచారం.

విపక్ష వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి ఖ‌రారు కావ‌టంతో పార్టీ అభ్యర్థుల విష‌యంపై అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్లు తెలుస్తోంది తిరుపతిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు లో సభ్యుల ఎంపిక పై ఓ నిర్ణయానికి రానున్నట్లు వినిపిస్తోంది అయితే గతంలో టీడీపీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన , కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మళ్ళీ అవకాశం కల్పించాలని టీడీపీని బీజేపీ కోరే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

దీనికి తోడు ప్రస్తుతం బాబు వద్ద కీల క వ్యక్తిగా ఉన్న సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ స్పష్టమైన హామీ పొందినట్లు వినవస్తోంది.ఈ ్ర‌క‌మంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తిరిగి ఎంపిక కావాల‌న్న దిశ‌గా ్ర‌ప‌య‌త్నాలు చేస్తుండగా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, బీటీ నాయుడు, ఎంవీవీఎస్ మూర్తితో పాటు మ‌రి కొంద‌రి పేర్లు వినవస్తున్నాయి తెంగాణ వారికి సీటు లేక‌పోవ‌టంతో వీరిలో ఇద్ద‌రికి అవ‌కాశం ద‌క్క‌టం ఖాయమ‌నిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube