నయనతార, త్రిష మధ్య గొడవలు.. పొడుగు తప్ప అందంలేని ఆమెకు అంత పొగరా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్షిణాది హీరోయిన్లుగా ఓకే టైంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నయనతార, త్రిష ఒకరని చెప్పవచ్చు.కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు దక్షిణాదిలోనే నెంబర్ వన్ హీరోయిన్స్ లో కొనసాగారు.

 Big Clash Between Nayantara And Trisha-TeluguStop.com

ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తి అయినప్పటికీ ఏ మాత్రం అవకాశాలు తగ్గకుండా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.అయితే ఒకానొక సమయంలో ఈ తారల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడిందని ఈ క్రమంలోనే వీరిద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న రేంజ్ లో గొడవ జరిగిందనే సమాచారం సోషల్ మీడియాలో వినిపించింది.

ఇలా ఈ అగ్ర తారలు పోటీపడి గొడవలు పడటం చేత మూడవ వ్యక్తి లబ్ధి పొందుతున్నారు.సాధారణంగా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం.

 Big Clash Between Nayantara And Trisha-నయనతార, త్రిష మధ్య గొడవలు.. పొడుగు తప్ప అందంలేని ఆమెకు అంత పొగరా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇద్దరు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ నువ్వానేనా అన్నట్టుగా పోటీలు పడుతూ సినిమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే తారల మధ్య గొడవలు మొదలయ్యాయని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఒకానొక సమయంలో త్రిష, నయనతారను ఉద్దేశిస్తూ పొడుగు తప్ప అందం లేని తనకు అంత పొగరు అవసరం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి.అయితే వీరిద్దరూ గొడవ పడటం వల్ల మరొకరు సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని మంచి విజయాలను అందుకుంటున్న నిజానిజాలను తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మలు ఆ తర్వాత ఒక్కటయ్యారు.

Telugu Big Clash Between Nayantara And Trisha, Clash, Heroine, Nayantara, Tollywood, Trisha-Movie

ఇలా పరస్పరం వీరి మధ్య జరిగిన గొడవలు మర్చిపోయి ఇండస్ట్రీలో ఎంతో స్నేహబంధంతో మెలుగుతున్నారు.ఇద్దరు హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఒకేసారి వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.కొంత మేర త్రిషకు అవకాశాలు తగ్గినప్పటికీ నయనతార మాత్రం బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు.ఈ ఇద్దరు తారలు కూడా కేవలం కమర్షియల్ చిత్రాలలో మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

అయితే అనుకోని విధంగా హీరోయిన్స్ విషయాలలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఇదివరకే పేరుగాంచిన దర్శకులతో నిశ్చితార్థం జరుపుకొని పెళ్ళిని కాస్తా వాయిదా వేసుకున్నారు.ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తున్నారు.

గత ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్న నయనతార ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నారని, ఈ ఏడాది డిసెంబర్ నెలలో కేరళలో ఒక ప్రముఖ చర్చిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్రిష కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈ విషయంపై ఈ తార స్పందించలేదు.

#BigClash #Trisha #Clash #Nayantara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు