సర్వేల ఎఫెక్ట్... యోగి కేబినెట్ లో భారీ మార్పులు  

Big Changes In Yogi Cabinet-election Results,tomorrow,uthar Pradesh,yogi,బీజేపీ,యోగి ఆదిత్యానాథ్‌

రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. మరోపక్క సర్వే ల ప్రకారం మళ్లీ బీజేపీ నే అధికారంలోకి వస్తుంది అన్న వార్తలు రావడం తో బీజేపీ వర్గాల్లో బాగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది..

సర్వేల ఎఫెక్ట్... యోగి కేబినెట్ లో భారీ మార్పులు-Big Changes In Yogi Cabinet

ఈ క్రమంలో నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు షా విందు కూడా ఏర్పాటు చేసి సంబరాలు కూడా చేసుకున్నారు.

అయితే బీజేపీ తిరిగి అధికారం చేపడుతుంది అనడం తో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ కూడా తనదైన శైలి లో యాక్షన్ కు దిగారు. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పనితీరు సరిగాలేవని వారికి కూడా యోగి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలో మొత్తం 46 మందికి మంత్రి వర్గంలో అవకాశం ఉండగా,అందులో ఇప్పటికే 14 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ 14 మంత్రి పదవులను భర్తీ చేయడమే కాకుండా పని తీరు సరిగా లేని వారిని కూడా మిగిలిన పదవులలో నుంచి తీసి కొత్త ఆశావహులకు అవకాశం ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే కేబినెట్‌ విస్తరణ సమయంలో ఆయా మంత్రుల నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోని ఆ పోస్టు లను భర్తీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.