కొంపముంచిన ఫేస్ ప్యాక్... కంటి చూపు కోల్పోయిన టిక్ టాక్ స్టార్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరికి వారు ఎలాంటి ప్రామాణికం లేకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ అంటూ కరోనా మెడిసన్ అంటూ, అలాగే ఇది తాగితే మీ పొట్ట తగ్గుతుంది.ఇది వాడితే మీరు రెట్టింపు అందంతో కనిపిస్తారని, ఇలా చేస్తే మీరు చాలా వేగంగా సన్నగా అయిపోతరంటూ ఊరుపేరు లేకుండా ఏవేవో ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తున్నారు.

 Big Brother Star Hospitalised After Reaction To Tiktok Beauty Hack, Social Media-TeluguStop.com

కొంతమంది అలాంటి వాటిని చూసి నిజమే అనుకొని వాడే ప్రయత్నం చేసి దెబ్బ తింటున్నారు.కొంత మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

కొంత మంది ఉన్న అందాన్ని నాశనం చేసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి అనుభవమే ఒక టిక్ టాక్ స్టార్, బిగ్ బ్రదర్ షో పార్టిసిపెంట్ కి ఎదురైంది.

సోషల్ మీడియాలో పేస్ బ్యూటీ ప్యాక్ గురించి చూసిన ఆమె నిజమని నమ్మేసి దానిని ఉపయోగించింది.అయితే ఆ ప్రోడక్ట్ కాస్తా సైడ్ ఎఫక్త్స్ ఇవ్వడంతో ముఖం అంతా కమిలిపోయి, బొబ్బలు వచ్చే కంటి చూపుని కూడా కోల్పోయింది.

ఈ దెబ్బకి హాస్పిటల్ లో చేరి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని సాధారణ స్థితికి వచ్చింది.తాజాగా తనకి ఎదురైనా అనుభవాన్ని సందరు టిక్ టాక్ స్టార్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది.

టిల్లీ విట్ ఫెల్డ్ ఆస్త్రేలియన్ బిగ్ బ్రదర్ షోలో పాల్గొంది.అందులో ఆమె పేస్ కి బ్లూక్లే పేస్ మాస్క్ ధరించింది.

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెని ప్రశ్నించారు.దానిని ఎందుకు ధరించారని అడిగారు.

దీనిపై ఆమె సమాధానంగా తనకి ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.ఆక్యూపంక్చర్ బ్యూటీ టిప్ ని చూసి, అది నచ్చడంతో ప్రయత్నం చేసానని, అయితే అది రివర్స్ లో రియాక్షన్ ఇచ్చి ముఖం మాడిపోయి, మచ్చలు వచ్చేశాయని పేర్కొంది.

కంటి చూపు కూడా కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది.తనలాగా ఎవరూ కూడా హోం మ్యాక్స్ చేసుకోవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి మోసపోవద్దని, నిపుణుల సలహాలు తీసుకొని ఏదైనా మేకప్ క్రీములు ఉపయోగించాలని ఈ సందర్భంగా ఆమె తన స్టొరీలో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube