బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి అరెస్ట్...!!!!     2018-12-04   09:17:13  IST  Sai M

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది…ఎలాంటి సంఘటనలు జరగకూడదు అనుకున్నారో ప్రస్తుతం అలాంటి సంఘటనలే ఉత్పన్నమవుతున్నాయి…టీఆర్ఎస్ కి గొంతులో పచ్చివెలక్కాయిలా ఉండే రేవంత్ రెడ్డి దూకుడికి కేసీఆర్ చెక్ పెట్టారు..అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ తలుపులు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేశారు..ఇప్పుడు ఈ సంఘటన యావత్ తెలంగాణా రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోంది..వివరాలలోకి వెళ్తే..

Big Breaking News ..T Congress Leader Revanth Reddy Was Arrested-Elections In Telangana KCR Kodangal Elections T TRS

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యిన రేవంత్ రెడ్డి..కొన్ని రోజులుగా సవాళ్ళ మీద సవాళ్లు విసురుతూ ఉన్నారు..అందులో భాగంగానే ముఖ్య‌మంత్రి కెసిఆర్ కోస్గి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని కొడంగల్ నేత రేవంత్ రెడ్డి పిలుపునివ్వ‌టంతో..టీఆర్ఎస్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇసి ఆదేశాల మేర‌కు కొడంగ‌ల్ పోలీసు స్టేష‌న‌లో రేవంత్ పై కేసు నమోదు చేశారు..మంగళవారం తెల్లవారకుండానే 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి చొచ్చుకుని వెళ్ళిన పోలీసులు..

Big Breaking News ..T Congress Leader Revanth Reddy Was Arrested-Elections In Telangana KCR Kodangal Elections T TRS

రేవంత్ రెడ్డి ఇంటి గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులను, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు..అయితే రేవంత్ ని మినహా వారిని పరిగివద్ద వదిలివెళ్లారు..దాంతో కోడంగల్ లో రేవంత్ రెడ్డి అనుచరులు ఆందోళనలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు..అయితే

Big Breaking News ..T Congress Leader Revanth Reddy Was Arrested-Elections In Telangana KCR Kodangal Elections T TRS

అరెస్టు నేపధ్యంలో రేవంత్ రెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తని బలవంతంగా తీసుకెళ్లారని..ఇంటిలోపకి వచ్చి మరీ ఎంతో దారుణంగా పరవర్తించారని ఆమె తెలిపారు..అంతేకాదు మా ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే మేం ఊరుకోం’ అని ఆమె పేర్కొన్నారు.

Big Breaking News ..T Congress Leader Revanth Reddy Was Arrested-Elections In Telangana KCR Kodangal Elections T TRS

ఇదిలాఉంటే రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది..ఆయన్ని అరెస్టు చేసిన తరువాత దాదాపు 100 మందికి పైగా పోలీసుల్ని ఆయన నివాసం వద్ద మోహరించారు…అయితే కేసీఆర్ సభని అడ్డుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించాడంతోనే ఈ విధంగా అరెస్టు చేయవలసి వచ్చిందని తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడటమే తమ కర్తవ్యమని పోలీసులు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్టు పై కాంగ్రెస్ ఏ విధంగా స్పదిస్తుందో వేచి చూడాలి..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.