బ్రేకింగ్ : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి 6 నెలల జైలు శిక్ష ..అసలు ఏం జరిగిందంటే...

2009 లో ద్రోణ సినిమా తో కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన జానీ మాస్టర్ , తెలుగులో దాదాపు అగ్ర హీరోలు ఎన్టీఆర్ , చిరంజీవి , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , రవితేజ , పవన్ కళ్యాణ్ లతో డాన్స్ స్టెప్ లు వేయించాడు.ప్రస్తుతం తెలుగు అగ్ర డాన్స్ కొరియోగ్రాఫర్ లలో ఒకరు జానీ మాస్టర్.

 Big Breaking Johnny Master Going To Prison For Check Bounce Case-TeluguStop.com

ఈయనకి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కోలీవుడ్ లో ప్రముఖ అగ్ర కథనాయకులతో పని చేసిన అనుభవం ఉంది .అయితే తాజాగా జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు.జానీ మాస్టర్ కు మేడ్చల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

అసలు విషయం ఇదే


2015లో జరిగింది ఒక చెక్ బౌన్స్ అయిన వివాదంలో జానీ మాస్టర్ పై చీటింగ్ కేసు నమోదైంది.ఆ సంవత్సరమే జానీ మాస్టర్ పై సెక్షన్ 354, 324, 506 కింద కేసులు నమోదయ్యాయి.ఆ కేసుల విషయంలో కోర్టు ఎట్టకేలకు తుది తీర్పుని వెల్లడించింది.

జానీ మాస్టర్ చేసిన నేరానికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది.చెక్ బౌన్స్ కేసు ఒక్కటే కాకుండా ఇంకొన్ని చీటింగ్ వ్యవహారాల్లో జానీ మాస్టర్ ని కోర్టు నిందితుడిగా ప్రకటించింది.

జానీ మాస్టర్ పై నమోదైన కేసులపై గత నాలుగు ఏళ్లుగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం సెక్షన్ 354 కేసులో వాస్తవం లేదని కొట్టివేసింది.మిగిలిన 324, 506 సెక్షన్స్ కింద నమోదైన కేసులు నిజమే అని నిర్ధారిస్తూ శిక్ష విధించింది.

జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి కూడా మేడ్చల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

సెక్షన్ 354 ఎందుకు కొట్టివేసింది


జానీ మాస్టర్ పైన ఉన్న 354 సెక్షన్ లో వాస్తవం లేదని కోర్ట్ కొట్టేసింది.ప్రమాదకర ఆయుధాలు ఉపయోగించినప్పుడు, గాయపరిచినప్పుడు, హత్యాయత్నం చేసినప్పుడు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు.జానీ మాస్టర్ అలాంటి పనులేవీ చేయలేదని కోర్టు నిర్ధారించడంతో ఆ సెక్షన్ కింద నమోదైన కేసుని కొట్టివేసింది.

కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.ఆయన బెయిలు దరఖాస్తు చేసుకుంటారా అనే విషయం ఇంకా తెలియలేదు.ఈ విషయం బయటకి రావడం తో జానీ మాస్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube