బిగ్ బ్రేకింగ్ - ఎన్నికలకి జనసేన దూరం..??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా.?? వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా.?? ఓడిపోతానని ఊహించారా.?? అసలేం జరుగుతోంది.?? జనసేన ఎన్నికలకి దూరం అన్న వార్తలు పుకార్లా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అనేది తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది.దాదాపు ఈ వార్త జనసేన శ్రేణులకి వెళ్ళడంతో ఇది నిజమా కాదా అనే సందేహంలో కొట్టు మిట్టాడుతున్నారు.

 Big Breaking Janasena Not Participating In 2019 Elections-TeluguStop.com

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై ఓ లుక్కేద్దాం.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయం అంటూ ఫిక్స్ అయిపోయారు ఏపీ ప్రజలు ఇదే విషయాన్ని జనసేన పార్టీ సైతం ఫిక్స్ చేసుకుంది.అయితే తాము మాత్రం కింగ్ మేకర్ అవుతామని మొదట్లో భావించినా ఇప్పుడు జగన్ కి వస్తున్న ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యిపోతున్నారు అందరూ అయితే.పవన్ కూడా దాదాపు ఇదే నిర్ణయానికి వచ్చారని, ఈ ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారని.

పార్టీలో కీలక వ్యక్తులు సైతం ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఎనికలకి ఎంతో సమయం లేదు పైగా పవన్ కి ఎంతో పట్టు ఉన్న ఉభయగోదావరి జిల్లాలలో సైతం పార్టీ ఇంకా నిర్మాణ సమయంలోనే ఉంది.

పవన్ తన సొంత జిల్లా పశ్చిమలో సైతం ఇప్పటి వరకూ అభ్యర్ధులని డిసైడ్ చేయకపోవడం వలన నేతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఇదిలాఉంటే ఉభయగోదావరి పై మాత్రమే దృష్టి పెడుతున్న పవన్ మిగిలిన జిల్లాలని అస్సలు పట్టించుకోవడం లేదు.

ఈక్రమంలో ప్రజలు టీడీపీ పై యాంటీ అవ్వడం జనసేన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో చాలా మంది ఓటర్లు టీడీపీ ని వదిలి వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారనేది సత్యం.

మరో పక్క జగన్ గ్రాఫ్ తన పాదయాత్రతో అమాంతం పెరిగిపోయింది.టీడీపీ నుంచీ చీలిన ఓట్లు మొదట్లో జనసేనకి పడతాయని భావించినా ఇప్పుడు మాత్రం ఆ ఓట్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ఖాతాలోకే వెళ్తాయని అంటున్నారు పరిశీలకులు.దాంతో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకి దూరంగా ఉండి.2024 ఎన్నికలకి బలమైన నేతగా బరిలో నిలబడటం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట పార్టీలోని నేతలు.ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతే అన్నయ్య కి పట్టినగతి మనకి పడుతుందని.

వచ్చే ఎన్నికల్లో అయితే మనం మరింత బలపడచ్చు అనేది వారి వాదన.మరి పవన్ వారి వాదనతో ఎకీభావిస్తాడా లేదా నష్ట నివారణం చర్యలు చేపడుతారా అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube